Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టూత్‌ పేస్ట్‌ కోసం బయటకొచ్చి.. భారీ మూల్యం చెల్లించుకున్న కోచ్!!

Bundesliga coach breaks quarantine to buy toothpaste

బెర్లిన్‌: చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తుండగా.. మరికొన్ని దేశాలు పలు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇస్తున్నాయి. జర్మనీ పలు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇచ్చింది. దీంతో శనివారం నుంచి జర్మనీలో బుండెస్లిగా ఫుట్‌బాల్‌ లీగ్‌ ఆరంభం కానుంది.

టూత్‌ పేస్ట్‌ కోసం బయటకొచ్చి

టూత్‌ పేస్ట్‌ కోసం బయటకొచ్చి

బుండెస్లిగా ఫుట్‌బాల్‌ లీగ్‌ ఆరంభ సందర్భంగా ఆటగాళ్లంతా క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఆగ్స్‌బర్గ్‌ జట్టుకు చెందిన కోచ్‌ హీకో హెర్లిచ్‌ మాత్రం క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించాడు. జట్టు బస చేసిన హోటల్‌లో ఉండకుండా.. రోడ్డుపైకి వచ్చాడు. తన టూత్‌ పేస్ట్‌, స్కిన్ క్రీం అయిపోయిందని.. దగ్గరలోని సూపర్‌ మార్కెట్‌కెళ్లి కొనుక్కొచ్చాడు. ఇది తెలుసుకున్న బుండెస్లిగా లీగ్ యాజమాన్యం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లతో సహా కోచ్‌లు కూడా క్వారంటైన్‌ నిబంధనల్ని పాటించాలని చెబితే.. ఏవో సాకులు చెప్పి బయటకు వెళ్లడాన్ని సీరియస్‌గా తీసుకుంది.

 రూల్స్‌ను హెర్లిచ్‌ బ్రేక్‌ చేసాడు

రూల్స్‌ను హెర్లిచ్‌ బ్రేక్‌ చేసాడు

కోచ్ హీకో హెర్లిచ్ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సూపర్‌ మార్కెట్‌కు వెళ్లడంతో.. బుండెస్లిగా లీగ్‌ పునః ప్రారంభపు మ్యాచ్‌కు దూరంగా ఉండాలంటూ లీగ్ అధికారులు ఆదేశాలు జారీ చేసారు. 'జర్మన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ టాస్క్‌ఫోర్స్‌ రూల్స్‌ను హెర్లిచ్‌ బ్రేక్‌ చేసాడు. ఈ కారణంగా అతను కనీసం ప్రాక్టీస్‌ సెషన్‌కు కూడా రాకుండా వేటు వేశాం. లీగ్‌ పునః ప్రారంభపు మ్యాచ్‌కు దూరంగా ఉంటాడు' అని బుండెస్లిగా లీగ్‌ అధికారి ఒకరు తెలిపారు. ఒక కోచ్‌గా ఆటగాళ్లకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

చాలా పెద్ద తప్పు చేశా

చాలా పెద్ద తప్పు చేశా

కోచ్ హెర్లిచ్‌ మాట్లాడుతూ... 'హోటల్‌ నుంచి బయటకొచ్చి చాలా పెద్ద తప్పు చేశా. నేను ఇప్పటివరకూ రూల్స్‌ పాటిస్తూ వచ్చాను. టూత్‌ పేస్ట్‌, స్కిన్ క్రీం లేకపోవడంతో బయటకు రావాల్సి వచ్చింది. నేను చేసిన తప్పును అంగీకరిస్తున్నా. ఒక రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన నేను క్వారంటైన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశా. ఈ కారణంగా ట్రైనింగ్‌తో పాటు ప్రారంభ మ్యాచ్‌కు‌ కూడా కోచ్‌గా చేసే అవకాశాన్ని కోల్పోయా. నాకు కరోనా టెస్టులు చేసి నెగిటివ్‌ వచ్చిన తర్వాత జట్టుతో కలుస్తా' అని అన్నాడు.

Story first published: Friday, May 15, 2020, 15:04 [IST]
Other articles published on May 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+