Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీలే, మారడోనాల సమకాలికుడు రొనాల్డో: బఫెన్ ప్రశంస

Buffon compares Ronaldo to Pele and Maradona after Champions League stunner

హైదరాబాద్: జువెంటస్ జట్టుపై రియల్ మాడ్రిడ్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వండర్ పుల్ గోల్ చేశాడు. దీంతో క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సీలను పీలే, డియాగో మారడోనాలతో పోల్చాడు జువెంటస్ గోల్ కీపర్ గియాంలుయిగి బఫెన్. టురిన్‌లో ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో జువెంటస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆశ్చర్యకరంగా క్రిస్టియానో రొనాల్డో ఓవర్ హెడ్ కిక్‌తో గోల్ సాధించడంతో 3-0 స్కోర్ తేడాతో రియల్ మాడ్రిడ్ విజయం సాధించింది.

అప్పటివరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ పోటాపోటీగా సాగింది. పోర్చుగల్ ఫార్వర్డ్ ఆటగాడు రెండో గోల్ సాధించడంతో అలియాంజ్ స్టేడియంలో రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ నుంచి మంచి ప్రోత్సాహం సాధించింది. ఇది రియల్ మాడ్రిడ్ జట్టును కీలక మలుపు తిప్పింది. మార్సెలో తర్వాత పాలో డ్యాబాలా మూడో గోల్ సాధించడంతో ఇటాలియన్లను ఇంటిముఖం పట్టింది.

పీలే, మారడోనాలకు సమకాలీనులు రొనాల్డో, మెస్సీ

పీలే, మారడోనాలకు సమకాలీనులు రొనాల్డో, మెస్సీ

ఓటములతో కృంగిపోకుండా దూసుకెళ్తున్న రియల్ మాడ్రిడ్ హీరో క్రిస్టియానో రొనాల్డో, బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీలను బఫన్ ప్రశంసించాడు. ‘మేం ఎల్లవేళలా రొనాల్డోలో ఒక అసాధారణ స్థాయి ఆటగాడిని చూస్తుంటాం. లియానెల్ మెస్సీతోపాటు అత్యున్నత లక్ష్యాలను సాధించాలని రొనాల్డొ కలలు కంటూ ఉంటాడు. రొనాల్డో, మెస్సీలను మారడోనా, పీలేలతో సరిపోల్చాల్సి ఉంటుందన్నాడు. వారిద్దరు ప్రతి మ్యాచ్ విజయావకాశాలను, ట్రోఫీలను కైవసం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నారని బఫెన్ చెప్పాడు.

ప్రత్యర్థి జట్టు సామర్థ్యాన్ని గుర్తించాలన్న బఫెన్

ప్రత్యర్థి జట్టు సామర్థ్యాన్ని గుర్తించాలన్న బఫెన్

బఫెన్ తన కెరీర్‌లో గతంలో ఏనాడూ ఛాంపియన్స్ లీగ్‌లో గెలుచుకునేందుకు ప్రయత్నించలేదు. శాంటియాగో బెర్నాబెలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముందు మ్యాచ్‌ల్లో ‘టై' సాధించలేకపోవడం ఆయనకు భారీ ఎదురు దెబ్బే. అయితే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయని బఫెన్ పేర్కొన్నాడు. ‘మీరు చాంపియన్లతో ఆడుతున్నపుడు.. వారు మిమ్మల్ని లెక్క చేయరు. మీరు ఒక ఉత్తమ జట్టుతో ఆడుతుంటారు అందునా 500 గోల్స్ సాధించిన ప్లేయర్‌తో ఢీకొడుతున్న విషయం మరిచిపోవద్దు' అని బఫెన్ తెలిపారు.

రొనాల్డోకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువ

రొనాల్డోకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువ

‘ఆటతీరులో పురోగతి సాధించలేకపోయినందుకు చాలా విచారం వ్యక్తం చేస్తున్నా. అసంతృప్తిగా కూడా ఉన్నది. మీరు బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు అది శక్తిమంతమైన జట్టు అని గుర్తించాలి' అని బఫెన్ చెప్పారు. మంగళవారం జువెంటస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్లిష్టతరమైన బైస్కిల్ కిక్ కొట్టిన రియల్ మాడ్రిడ్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

క్లిష్టతరమైన గోల్‌తో రియల్ మాడ్రిడ్‌ను గట్టెక్కించిన రొనాల్డో

క్లిష్టతరమైన గోల్‌తో రియల్ మాడ్రిడ్‌ను గట్టెక్కించిన రొనాల్డో

చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకున్న రియల్ మాడ్రిడ్.. జువెంటస్ జట్టుపై 3-0 స్కోర్ తేడాతో గెలుపొందినందుకు లేబ్రోన్ జేమ్స్ తదితరులు రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు. అలియాంజ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గోల్ సాధించడం రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ లేచి నిలబడి రొనాల్డోకు అనుకూలంగా కేరింతలు కొట్టారు. ఇది రొనాల్డోకు చిరస్మరణీయమైన జ్నాపకంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.

Story first published: Wednesday, May 23, 2018, 13:58 [IST]
Other articles published on May 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+