Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గృహ నిర్బంధానికి గురైన లియోనా మెస్సీ సోదరుడు

Brother of Messi placed under house arrest for arms possession

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ సోదరుడు గృహనిర్భంధానికి గురైయ్యాడు. ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడ్డ అతన్ని అక్కడి పోలీసులు అనుమానిస్తూ అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. లియోనల్ మెస్సీ సోదరుడు మాట్యాస్ మెస్సీ (35) బార్సిలోనా అండ్ అర్జెంటీనా ప్రాంతంలోని స్వగృహంలో అరెస్టయ్యాడు. నవంబరు 30వ ఒక ఇసుక దిన్నెకు తన మోటార్ బోట్‌తో ఢీకొని తీవ్ర గాయాలకు గురైయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద స్థలంలో అతనితోపాటుగా అక్రమ తుపాకీ ఉండటంతో దానిని స్వాధీన పరచుకున్నారు. దానికి మాట్యాస్ మెస్సీకి ఎలాంటి సంబంధం ఉందనే దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

తన ఇంటికి 300 కిలోమీటర్ల దూరంలో గల క్యాపిటల్ బ్యూనోస్ ఎయిర్స్ ఆసుపత్రిలో మాట్యాస్ చికిత్స పొందాడు. సైబర్ క్రైమ్, అక్రమ ఆయుద నిఘా పోలీసులు అక్కడి నుంచి ఇంటికి తరలించి గృహ నిర్బంధం చేసి విచారణ చేపట్టారు. నిందితుడి స్వభావం గురించి తండ్రి జార్జ్ మెస్సీని కూడా విచారణ జరిపారు. ఇంతకుముందు కూడా ఇలాంటి విషయంలో ఓసారి మాట్యాస్ అరెస్ట్ అవగా ఇది రెండోసారి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 12, 2017, 12:45 [IST]
Other articles published on Dec 12, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+