For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుట్‌బాల్ ప్లేయర్ హద్దు దాటి.. లైవ్‌లో మహిళా జర్నలిస్టుకు ముద్దు..

 Brazilian sports journalists may be having their #MeToo moment

హైదరాబాద్: అదో ప్రఖ్యాత ఫుట్‌బాల్ టోర్నమెంట్ (లిబర్టాడోర్స్ సాకర్ టోర్నమెంట్) ఇరు జట్లు మంచి బలమైన జట్లు. అభిమానుల హోరు మధ్య ఓ మహిళా జర్నలిస్టు బ్రూనా డిల్ట్రా ఆ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అక్కడికి వెళ్లింది. అక్కడికి వచ్చిన అభిమానులను అడిగి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. ఇలా రిపోర్టింగ్ చేస్తుండగానే మధ్యలో ఓ ప్లేయర్ విచక్షణ మరిచాడు.

ఆమె పెదాలను ముద్దు పెట్టబోయాడు. అక్కడ జరిగిన హఠాత్పరిణామాన్ని క్షణాల్లో తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా తప్పుకుంది. క్రీడా స్ఫూర్తిని మరచి క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినందుకు క్షమాపణ కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ ఫుట్‌బాల్ ప్లేయర్. జరిగిన పరాభవంతో పనిని ఆపేయకుండా ఆ మహిళా జర్నలిస్టు కార్యక్రమాన్ని ముగించింది.

అయితే ఇలా జరగడం మొదటిసారేం కాదు. మమ్మల్ని ఎందుకు గౌరవించరంటూ.. తను సోషల్ మీడియా వేదికగా ఆవేదనను వెల్లగక్కింది. ఆ వీడియోకు సహ మహిళా జర్నలిస్టులు స్పందించారు. సుమారు 50మంది వరకు తమ తమ అభిప్రాయాలను తెలుపుతూ.. మరో వీడియో సందేశాన్ని పంపారు. దీంతో అక్కడ మీటూ ఉద్యమం మొదలైంది.

ఓ మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టుతో ప్లేయర్లు ఇలాగా ప్రవర్తిస్తారా అని మిగతా జర్నలిస్టులూ ప్రశ్నిస్తున్నారు. బ్రూనాలాగే వేధింపులకు గురైన కొందరు మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టులు తాజాగా ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Story first published: Sunday, April 1, 2018, 15:56 [IST]
Other articles published on Apr 1, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+