విటులకోసం వేశ్యలకు ప్రభుత్వం ఇంగ్లీష్ పాఠం(పిక్చర్స్)
లండన్: బ్రెజిల్‌లో వేశ్యలు ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకుంటున్నారు. బ్రెజిల్‌లో దాదాపు పది లక్షల మంది వేశ్యలు ఉన్నారు. ఇంగ్లీష్ రాని వాళ్లు ఆ భాష పైన పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వచ్చే నెలలో సాకర్ ప్రపంచ కప్ సందర్భంగా తమ వద్దకు వచ్చే విదేశీ విటులను ఆకర్షించేందుకు వారు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.
వందలాదిమంది వేశ్యలు ఇంగ్లీష్ తరగతులకు హాజరవుతున్నారు. బ్రెజిల్‌లో వ్యభిచారం చట్టబద్ధం. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే వేశ్యలకు ఉచితంగా తరగతులు నిర్వహిస్తోంది.

బ్రెజిల్
వచ్చే నెలలో ఫిఫా ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో... ఆతిథ్యం విషయంలో ఏమాత్రం లోటు రాకూడదని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. అందుకే ఇంగ్లీష్ రాని తమ దేశ వేశ్యలతో అతిథులు ఇబ్బంది పడకూడదని ఈ ఏర్పాటు చేశారు.

బ్రెజిల్
ప్రపంచ కప్ నేపథ్యంలో.. దానిని సొమ్ము చేసుకునేందుకు వేశ్యలు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకోవడంతో పాటు... క్రెడిట్ కార్డ్ గురించిన విషయాలు తెలుసుకుంటున్నారు.

బ్రెజిల్
బ్రెజిల్‌లో జరగనున్న ప్రపంచ కప్‌ను చూసేందుకు 3.7 మిలియన్ సాకర్ ఫ్యాన్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రపంచ కప్ నేపథ్యంలో మైనర్లు వ్యభిచారంలో ఉండకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

బ్రెజిల్
సాకర్ ప్రపంచ కప్ చూసేందుకు వచ్చే వాళ్లు వ్యభిచారిణిల దగ్గరకు వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా డబ్బులు ఇచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో వ్యభిచారిణులు క్రెడిట్ కార్డ్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications