Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Neymar: బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్ నెమార్‌కు కరోనా!!

Brazilian footballer Neymar test positive for coronavirus

రియో డి జనీరో (బ్రెజిల్‌): బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్, ప్యారిస్‌ సెయింట్‌-జెర్మయిన్‌ క్లబ్‌ జట్టు ఫార్వర్డ్‌ ప్లేయర్‌ నెమార్‌కు కరోనా వైరస్ సోకింది. నెమార్‌తో పాటు ప్యారిస్‌ సెయింట్ జెర్మయిన్‌ క్లబ్‌ ఆటగాళ్లు ఏంజెల్ డి మారియా, లియాండ్రో పరేడెస్‌లకు కరోనా పాజిటివ్ అని తేలిందట. ఈ విషయాన్ని లిగ్యూ 1 క్లబ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ప్యారిస్‌ సెయింట్‌-జెర్మయిన్‌ క్లబ్ తమ ఆటగాళ్ల పేర్లను చెప్పడానికి నిరాకరించిందట.

'ముగ్గురు ప్యారిస్‌ సెయింట్-జెర్మయిన్‌ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ముగ్గురు కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. క్లబ్ ఇతర ఆటగాళ్లు మరియు కోచింగ్ సిబ్బంది అందరికి రాబోయే రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తాం' అని క్లబ్ పేర్కొంది. తమ ఇద్దరు ఆటగాళ్లకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో నిర్బంధంలోకి వెళ్లారని ఫ్రెంచ్ ఛాంపియన్స్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

లిగ్యూ 1 సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్యారిస్‌ సెయింట్‌-జెర్మయిన్‌ తమ ప్రచారాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఎందుకంటే గత నెల ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు వెళ్లిన ఆ క్లబ్.. ఆ తరువాత విరామం తీసుకుంది. పర్షియన్ క్లబ్ సెప్టెంబర్ 10న రేసింగ్ లెన్స్‌తో తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఇక నెమార్‌కు కరోనా సోకడంతో అతని అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

గతంలో నెమార్ క‌రోనా వైర‌స్‌పై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి, విమ‌ర్శ‌ల‌ పాలయ్యాడు. ఒక బీచ్ వాలీబాల్ కోర్టులో చాలామంది సన్నిహితంగా కలసి గడుపుతున్న ఫోటో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. క‌రోనా వైర‌స్ వచ్చిన వేళ అందరూ సెల్ఫ్ ఐసొలేషన్‌కు సిద్ధమవుతున్నవేళ.. నేమార్‌ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇక నెమార్‌ కరోనా కట్టడికి భారీ విరాళమిచ్చిన సంగతి తెలిసిందే. అతను 10 లక్షల డాలర్ల (రూ. 7,64, 18,241) విరాళం ప్రకటించినట్లు అక్కడి స్థానిక టీవీ చానల్‌ తెలిపింది. ఈ మొత్తాన్ని 'యూనిసెఫ్‌'తో పాటు టీవీ వ్యాఖ్యాత లూసియానో హక్‌ ఆధ్వర్యంలో జరుగుతోన్న చారిటీ క్యాంపెయిన్‌ కోసం వినియోగించనున్నారు.

Story first published: Wednesday, September 2, 2020, 21:52 [IST]
Other articles published on Sep 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+