నేయ్మార్‌కు గాయంతో ఆశల ఊసులపై నీళ్లు
అయితే బ్రెజిల్ సారథి నేయ్మార్ గాయంతో గత ఫిబ్రవరిలో ఇంటికి పరిమితమైనప్పుడు ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. కానీ 26 ఏళ్ల నేయ్మార్ శిక్షణ కోసం జాతీయ జట్టులో పాల్గొనడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. 2014 సాకర్ కప్ టోర్నమెంట్లో ఆతిథ్య జట్టుగా సెమీ ఫైనల్స్‌లో ఓటమితో అవమాన భారాన్ని మిగుల్చుకున్నది బ్రెజిల్.
క్వార్టర్ ఫైనల్స్ దశకు వెళ్లడంపై బ్రెజిల్ విశ్వాసం
గ్రూప్ ఈ లో చేరిన బ్రెజిల్ హాట్ ఫేవరెట్ అంటే అతిశయోక్తి కాదు. స్విట్జర్లాండ్, సెర్బియా జట్లతో బ్రెజిల్ తలపడిన తర్వాత రెండో దశలో కోస్టారికాతో ఆడుతుంది. అంతే కాదు నాలుగేళ్ల తర్వాత జరిగే రష్యా సాకర్ సంరంభంలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే విషయమై విశ్వాసంతో ఉంది బ్రెజిల్.
2010లో ప్లేఆఫ్ రూట్లో పోర్చుగల్ క్వాలిఫై
క్వాలిఫయింగ్ దశలో పోర్చుగల్ జట్టుతో స్విట్జర్లాండ్ టీంతో 2010లో తలపడింది. ఫ్లేఆఫ్ రూట్లో పోర్చుగల్ అర్హత సాధించింది. ప్రపంచ కప్ టోర్నమెంట్లో టైటిల్ మిస్ చేసుకున్న సెర్బియా టీంకు కోచ్ మ్లాడెన్ క్ర్సాజిక్ నియామకంతో మళ్లీ ఆ జట్టు ఆశలు చిగురించాయి. వరుసగా ఐదు ప్రపంచ కప్ టోర్నమెంట్లలోనూ నాలుగో స్థానంలో నిలిచిన సెర్బియా కూడా సాకర్ కప్ టైటిల్‌పై ఆశలు భారీగానే పెట్టుకుంది.
2014లో కోస్టారికాను అడ్డుకున్న కెయ్లొర్ నవాజ్
రియల్ మాడ్రిడ్ గోల్ కీపర్ కేయ్లొర్ నవాస్ బ్రెజిల్ తరఫున ఆడుతున్న హై ప్రొఫైల్ ప్లేయర్. 2014 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ‘లాస్ట్ 4' దశకు చేరుకున్న బ్రెజిల్ జట్టు గోల్ కీపర్ గా కెయ్లోర్ నవాస్.. కొస్టారికా జట్టు గోల్స్ చేయకుండా అడ్డుకోగలిగాడు. ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు గోల్స్‌ను అడ్డుకున్నాడు.