న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: క్వార్టర్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన బ్రెజిల్.. వరల్డ్ కప్‌లో వరుసగా ఎనిమిదోసారి..!

Brazil storm to quarter finals for the 8th straight time

ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్ బ్రెజిల్.. ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో జోరు కొనసాగిస్తోంది. గ్రూప్ దశలో అద్భుతంగా రాణించి నాకౌట్స్ చేరిన ఈ జట్టు.. నాకౌట్స్ మ్యాచ్‌లో సౌత్ కొరియాను చిత్తు చేసింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో గాయపడిన నెయ్‌మార్.. ఈ మ్యాచ్‌లో జట్టుతో కలిశాడు. అతను కూడా అద్భుతంగా ఆడి ఒక గోల్ చేశాడు. మిగతా ఆటగాళ్లు కూడా రాణించడంతో సౌత్ కొరియాను 4-1 తేడాతో బ్రెజిల్ చిత్తుచేసింది.

ప్రపంచ నెంబర్ వన్ జట్టు బ్రెజిల్ అద్భుతంగా ఆడుతోంది. సౌత్ కొరియాతో మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే వినిషియస్ జూనియర్ తొలి గోల్ సాధించాడు. నెయ్‌మార్ తర్వాత బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్ గోల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా అతను రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కాసేపటికే బ్రెజిల్‌కు పెనాల్టీ దక్కింది. దీన్ని నెయ్‌మార్ తనదైన స్టైల్‌లో గోల్ చేశాడు.

Brazil storm to quarter finals for the 8th straight time

ఆ తర్వాత 29వ నిమిషంలో రిచార్లీ సన్ మరో గోల్ సాధించాడు. దీంతో మైదానం అంతా సాంబా డ్యాన్స్‌తో ఉత్సాహం నిండింది. బ్రెజిల్ ఆటగాళ్లు కూడా తమ సెలబ్రేషన్స్‌తో అందరినీ అలరించారు. కాసేపటికే 36వ నిమిషంలో లూకాస్ పకూటా మరో గోల్ చేయడంతో మ్యాచ్ తొలి హాఫ్ టైం ముగిసే సరికి 4-0తో సౌత్ కొరియాపై బ్రెజిల్ తిరుగులేని ఆధిక్యం సాధించింది.

Brazil storm to quarter finals for the 8th straight time

అయితే సెకండ్ హాఫ్‌లో బ్రెజిల్ ఆ జోరు కొనసాగించలేకపోయింది. తమ గోల్ ట్యాలీని మరింత పెంచుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివర్లో 76వ నిమిషంలో కొరియా తరఫున సుంగ్ హో పాక్ బాక్స్ బయటి నుంచి అద్భుతమైన షాట్‌తో గోల్ చేశాడు. కానీ ఫలితం మాత్రం మారలేదు. ఆ తర్వాత కొరియా జట్టు మరో గోల్ చేయడానికి విశ్వప్రయత్నం చేసినా అవకాశం దక్కలేదు. దీంతో 4-1 తేడాతో ఈ మ్యాచ్ గెలిచిన బ్రెజిల్.. వరుసగా 8వ సారి వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది.

Story first published: Tuesday, December 6, 2022, 10:13 [IST]
Other articles published on Dec 6, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X