For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: వరల్డ్ కప్‌లో బ్రెజిల్ శుభారంభం.. 2-0తో సెర్బియాపై విజయం..!

Brazil started their Fifa World Cup 2022 campaign on a winning note

ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన బ్రెజిల్‌కు శుభారంభం దక్కింది. సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2-0 తేడాతో నెగ్గింది. ఈ విజయంతో వరల్డ్ కప్‌లో బ్రెజిల్ క్యాంపెయిన్ ప్రారంభం అవడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఈసారి కూడా వరల్డ్ కప్ తమ జట్టే గెలుస్తుందని ధీమాగా చెప్తున్నారు. సెర్బియాపై విజయం ఈ ప్రయాణంలో తొలి అడుగు అంటున్నారు.

సూపర్ ఫామ్‌లో బ్రెజిల్..

సూపర్ ఫామ్‌లో బ్రెజిల్..

ప్రస్తుతం బ్రెజిల్ జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. వివిధ టోర్నీల్లో చివరగా ఆడిన ఏడు మ్యాచుల్లోనూ బ్రెజిల్ విజయాలనే నమోదు చేసింది. అదే సమయంలో చివరగా తాము ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించిన సెర్బియా.. ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. గ్రూప్-జీలో నుంచి తర్వాతి దశకు చేరుకునే రెండు బెర్తుల కోసం బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్ మధ్య పోటీ నెలకొంది. వీటిలో బ్రెజిల్ సులభంగా మరుసటి దశకు చేరుతుందని అంచనా.

ఫస్ట్ హాఫ్ టై..

ఫస్ట్ హాఫ్ టై..

ఈ క్రమంలోనే సెర్బియా, బ్రెజిల్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మొలైంది. తొలి అర్ధభాగంలో బంతిని సుదీర్ఘ సమయం పాటు బ్రెజిల్ జట్టు తమ వద్దనే ఉంచుకుంది. ఈ సమయంలో వీరి బాల్ పొసెషన్ రేటు 59 శాతంగా ఉంది. అయితే సెర్బియా కూడా గట్టిగా పోరాడింది. అయితే రెండు జట్లు తమకు దక్కిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోయాయి. దీంతో తొలి అర్ధభాగాన్ని 0-0తో ముగించాయి.

రెండో అర్ధభాగంలో రెండు గోల్స్..

రెండో అర్ధభాగంలో రెండు గోల్స్..

సెకండ్ హాఫ్‌లో కూడా రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో 62వ నిమిషంలో బ్రెజిల్ ప్లేయర్ రిచర్లీసన్ అద్భుతమైన గోల్ సాధించాడు. ఆ తర్వాత మరో 11 నిమిషాల్లోనే ఇంకో గోల్ కూడా చేశాడు. ఈ గోల్స్ చేయడంలో నెయ్‌మార్ జూనియర్, వినీషియస్ జూనియర్ అతనికి మంచి పాస్‌లు అందించారు. అయితే ఈ స్కోరును సమం చేయడానికి, మ్యాచ్‌లో విజయం సాధించడానికి సెర్బియా చాలా కష్టపడింది. కానీ ఆ జట్టు ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. దీంతో 2-0 తేడాతో బ్రెజిల్ ఈ మ్యాచ్ గెలిచి గ్రూప్-జిలో టాప్ ప్లేస్ ఆక్రమించింది.

నెయ్‌మార్‌కు గాయం..

నెయ్‌మార్‌కు గాయం..

ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్‌ కాలికి గాయమవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అతనికి గాయమవడంతో 80వ నిమిషంలో జట్టు కోచ్ అతన్ని వెనక్కు పిలిచాడు. ఆ తర్వాత తమ డగౌట్ వద్ద నెయ్‌మార్ కుంటుకుంటూ నడవడం కనిపించింది. అలాగే యువ ప్లేయర్ రఫీనాపై అభిమానులు మండిపడుతున్నారు. జట్టు సృష్టించిన రెండు అవకాశాలను అతను వృధా చేశాడు. అలాంటి వాడిని అర్జెంటుగా జట్టులో నుంచి తీసేసి పక్కన కూర్చోబెట్టాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Friday, November 25, 2022, 12:15 [IST]
Other articles published on Nov 25, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+