రియోడిజనిరో: ఫుట్ బాల్ ప్రపంచ కప లో వైఫల్యాల పర్యవసానాలు తీవ్రంగా ఉంటున్నాయి. బ్రెజిల్ కోచ్ కార్లొస్ దుంగాపై వేటు పడింది. ఫిఫా ప్రపంచకప్ ఫేవరెట్ బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించడంతో కోచ్ దుంగాను తొలగించాలని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (సీబీఎఫ్) నిర్ణయం తీసుకుంది.
"2010 ప్రపంచకప్ కోసం 2006 నుంచే శ్రమించాం. కానీ బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగడంతో మా శ్రమ వృథా అయింది. అందుకే దుంగాను తొలగించడమే కాక బ్రెజిల్ జట్టు సాంకేతిక కమిషన్ ను కూడా రద్దు చేశాం" అని సీబీఎఫ్ చెప్పింది.