హైదరాబాద్: బ్రెజిల్‌కు చెందిన పుట్‌బాల్ లెజెండ్ పీలే (74) కోలుకున్నాడు. గత కొంత కాలంగా ప్రొస్టాటిక్ హైపర్‌లేసియా వ్యాధితో బాధపుడుతన్న పీలే రెండు వారాల క్రితం ఆసుపత్రిలో చేరాడు. పలు శస్త్ర చికిత్సలు నిర్వహించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రి వైద్యులు ఆయన్ని ఆదివారం సాయంత్రం 6.30 నిమిషాల ప్రాంతంలో డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.
గత ఆరునెలల్లో పీలే ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారని వైద్యులు తెలిపారు. బ్రెజిల్‌కు పుట్‌బాల్ ప్రపంచ కప్‌ను మూడు సార్లు అందించిన ఆటగాడిగా పీలే రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన క్రీడా జీవితంలో పుట్‌బాల్ ఆటలో 1,280 గోల్స్‌ను సాధించాడు.

ప్రపంచ వ్యాప్తంగా పుట్‌బాల్ క్రీడలో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ పుట్‌బాల్ ప్లేయర్లలో పీలే ఉన్నారు. 2004లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న పీలే, ఆ తరువాత 2012 లో ఎముక సంబంధింత ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇక ఈ ఏడాది జనవరిలో మూత్ర పిండాల్లో రాళ్లు తొలగించుకునేందుకు సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.