For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fifa World Cup 2022: నెయ్‌మార్ లేకపోవడంతో.. అతికష్టం మీద గెలిచి నాకౌట్ చేరిన బ్రెజిల్

Brazil enters knockouts with win over Switzerland

ఫిఫా వరల్డ్ కప్ 2022 గెలిచే జట్టు అంటూ అందరూ చెప్పుకుంటున్న బ్రెజిల్ అతి కష్టం మీద నాకౌట్స్ చేరింది. గత మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్‌కు గాయమైంది. దీంతో అతను గ్రూప్ దశ మ్యాచులకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన బ్రెజిల్.. తొలి హాఫ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆటగాళ్లు చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల గోల్స్ చేసే అవకాశాలను చేజేతులారా జారవిడుచుకుంది. దీంతో తొలి హాఫ్‌ను 0-0తో ముగించింది.

ఈ సమయంలో బ్రెజిల్ ప్లేయర్ వినిషియస్ జూనియర్ అందించిన బంతికి అద్భుతమైన షాట్ కొట్టాడు రఫీనా. కానీ స్విస్ గోల్ కీపర్ యాన్ సోమర్ చటుక్కున ముందుకు దూకి ఆ గోల్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత వినిషియస్ అందించిన క్రాస్‌ను రిచార్లీసన్ సరిగా అందుకోలేకపోయాడు. దీంతో ఆ జట్టు మరో గోల్ చెయ్యలేకపోయింది. ఇలా నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుంది అనిపించింది.

Brazil enters knockouts with win over Switzerland

సెకండ్ హాఫ్‌లో స్విట్జర్లాండ్ జోరు పెంచినా గోల్స్ చెయ్యలేకపోయింది. 64వ నిమిషంలో రిచార్లీసన్ చేసిన పొరపాటుతో ఇక మ్యాచ్ బ్రెజిల్ చేజారినట్లే అనిపించింది. ఈ డెడ్‌లాక్‌ను వినిషియస్ జూనియర్ బ్రేక్ చేశాడు కానీ.. రిచార్లీసన్ ఆ సమయంలో ఉన్న పొజిషన్‌ను బట్టి అది ఆఫ్‌సైడ్ కిందకు వస్తుందని వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) చెప్పాడు. దీంతో ఆ గోల్.. బ్రెజిల్ ఖాతాకు చేరలేదు.

Brazil enters knockouts with win over Switzerland

మరో ఏడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. ఇలాంటి ఒత్తిడి సమయంలో బ్రెజిల్‌కు అండగా నిలిచే కేసమిరో మరోసారి ఆ జట్టును ఆదుకున్నాడు. తన వైపు వచ్చిన హాఫ్ వాలీని అద్భుతమైన టెక్నిక్‌తో గోల్ చేశాడు. చివర్లో అదనంగా ఇంజూరీ టైం అందించారు. ఆ సమయంలో గాబ్రియల్ జీసస్ చక్కని అసిస్ట్‌తో బంతిని సబ్‌స్టిట్యూట్ రోడ్రిగోకు పంపాడు. కానీ దాన్ని అతను సరిగా అందుకోలేకపోయాడు. దీంతో బ్రెజిల్ తమ ఆధిక్యాన్ని పెంచుకోలేకపోయింది. స్విట్జర్లాండ్ కూడా మరో గోల్ చేయలేకపోవడంతో విజయం బ్రెజిల్‌నే వరించింది.

Story first published: Tuesday, November 29, 2022, 12:12 [IST]
Other articles published on Nov 29, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+