బ్రెజిల్: బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నెయ్‌మార్‌కు అధికారులు షాకిచ్చారు. అతడికి చెందిన దాదాపు రూ.340 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేశారు. గత ఏడాది నెయ్మార్ కుటుంబం వ్యాపారంలో మోసం చేయడమే కాకుండా భారీగా పన్నులు ఎగ్గొట్టిందని తేలినట్లుగా తెలుస్తోంది.
దీనిపై న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవలే నెయ్మార్ ఆస్తులను జప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై నెయ్మార్ సావోపాలో ఫెడరల్ న్యాయస్థానంలో అప్పీల్ చేశాడు. నెయ్మార్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.
దీంత అధికారులు అతడి ఆస్తులను జప్తు చేశారు. నెయ్‌మార్‌కు చెందిన భారీ నౌక, ప్రయివేటు విమానంతో పాటు విలువైన ఆస్తులు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి నెయ్‌మార్‌ను, అతని తండ్రిని ఈ నెలలో విచారించారు.