Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్: సిడ్నీలో భారత్‌ను దూషించారు, పాక్-భారత్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు!

సిడ్నీ: ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా సిడ్నీలో ఘర్షణ జరిగింది. సిడ్నీలోని మేరీల్యాండ్స్ క్లబ్‌లో దాదాపు 180 మంది అభిమానులు టీవీలో ఈ మ్యాచ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగింది.

40 మంది బాహాబాహీ తలపడ్డారు. వీరిలో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించి అరెస్టు చేయవలసి ఉంది.

Brawl in Sydney club after India beat Pakistan at World Cup

గాయపడ్డ వారిలో ముగ్గురిని వెస్ట్ మీడ్ ఆసుపత్రికి, ఒకరిని అబర్న్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆదివారం జరిగిన భారత్ - పాక్ మ్యాచులో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను వంద కోట్ల మందికి పైగా చూశారు.

భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ ఓడిన నేపథ్యంలో కొందరు పాక్ అభిమానులు భారత్‌ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో భారత్, పాక్ అభిమానుల మధ్య గొడవ జరిగిందని సమాచారం.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+