న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

చాన్స్‌లు మిస్‌: డైనమోస్‌తో కేరళ మ్యాచ్‌ డ్రా

కోచి: తొలి విజయం కోసం ఆర్తిగా కేరళ బ్లాక్‌బస్టర్స్‌.. వరుసగా రెండో మ్యాచ్‌ గెలుపుకోసం ఢిల్లీ డైనమోస్‌చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. శనివారం రాత్రి కోచిలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఏ జట్టూ పాయింట్‌ సాధించకుండానే డ్రాగా ముగిసింది. మ్యాచ్‌ ముగింపు దశకు వచ్చేసరికి ఇరు జట్లలో వేడి పెరిగింది. గోల్‌ కోసం ఎంత రిస్క్‌ చేసేందుకైనా వారు వెనుకాడలేదు. పలువురు క్రీడాకారులకు గాయం కావడంతో రిఫరీ ఆరు నిమిషాల టైమ్‌ ఇచ్చారు.

ఇక సొంతగడ్డపై స్థానిక అభిమానుల మద్దతు ఉన్నా కేరళ బ్లాక్‌బస్టర్స్‌ కుర్రాళ్లు చివరిక్షణాల్లో ఒత్తిడికి గురయ్యారు. మరోవైపు రెండో వరుస గెలుపు కోసం బరిలోకి దిగిన ఢిల్లీ డైనమోస్‌ చివరివరకూ డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా తొలి హాఫ్‌లో కేరళబ్లాక్‌బస్టర్స్‌ ఆటగాడు మిఖైల్‌ చోప్రా, సెకండాఫ్‌లో ఢిల్లీ మెరుపుల వీరుడు మార్సెలిన్హోలకు గోల్‌చేసేందుకు వచ్చిన అవకాశాలు మిస్‌చేసుకున్నారు.

మ్యాచ్‌ ప్రారంభంలో సొంత గడ్డపై ఆధిపత్యం ప్రదర్శించిన కేరళ కుర్రాళ్లు గోల్‌చేసేందుకు పలుసార్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగంచేసుకోలేకపోయారు. 12వ నిమిషంలోనే మిఖైల్‌ చోప్రా నేరుగా బంతిని కిక్‌కొట్టినా అది లక్ష్యాన్ని చేరుకోలేదు. మళ్లీ తొలి హాఫ్‌కు చివరి నిమిషంలోనూ చోఫ్రా తనకు వచ్చిన బెస్ట్‌ చాన్స్‌ను సావకాశంగా తీసుకుని కిక్‌ కొట్టినా ఢిల్లీ గోల్‌ కీపర్‌ టోనీ డోబ్లాస్‌ తిరగొట్టాడు.

Blasters, Dynamos share spoils after drab draw

డిఫెన్సివ్‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఢిల్లీ డైనమోస్‌కు బాక్స్‌లో ఉన్న బాదారా బాద్జీకి 21వ నిమిషంలో ఫ్లోరెంట్‌ మాలౌడా పంపిన ఫ్రీ కిక్‌ బంతి సెనెగలీస్‌ ఫార్వర్డ్‌ సరిగ్గా అర్థంచేసుకోకపోవడంతో బంతి గోల్‌ పోస్ట్‌ వద్దకు పక్కకెళ్లిపోయింది. సెకండాఫ్‌ ప్రారంభంలో ఢిల్లీ కుర్రాడు డోబ్లాస్‌ మ్యాచ్‌ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. బ్రేక్‌ తర్వాత ఇరు జట్లు చురుగ్గా వ్యవహరిస్తూ పరస్పరం గోల్స్‌ చేయకుండా నిలువరించుకున్నారు.

ప్రత్యేకించి కేరళ బ్లాక్‌బస్టర్స్‌లో డిఫెన్స్‌ ఫేలవంగా ఉంది. ఢిల్లీ కుర్రాళ్లు కలిసికట్టుగా దూసుకెళ్తుంటే.. బ్లాక్‌బస్టర్స్‌ ఆటగాళ్లలో ఆ తెలివిడి లోపించింది. డైనమోస్‌కు 83వ నిమిషంలో వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగంచేసుకోలేకపోయింది. మాలౌడా మరోసారి తెలివిగా వ్యవహరిస్తూ హెడర్‌ కిక్‌ పంపినా ప్రయోజనం లేకపోయింది.

కేరళ బ్లాక్‌ బస్టర్స్‌ వెనుకవైపు స్పేస్‌ను సదవకాశంగా మార్చుకొనేందుకు ఢిల్లీకి చెందిన మార్సెలిన్హో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అసలు తొలి నుంచి ఢిల్లీ డైనమోస్‌ ఆశ్చర్యకరమైన రీతిలో ముభావంగా, సరైన దిశా నిర్దేశం లేకుండా వ్యవహరించారు. ప్రత్యర్థి జట్టును ముందుకెళ్లకుండా డిఫెన్సివ్‌ ధోరణి ప్రదర్శించారు.

మార్సెలిన్హో ప్రారంభంలో గోల్‌ కోసం చేసిన యత్నాన్ని కేరళ బ్లాక్‌బస్టర్స్‌ గోల్‌ కీపర్‌ సందేశ్‌ జిజ్నాన్‌ అడ్డుకోవడం ఆ అవకాశమూ మిస్సయింది. పలు దఫాలు గోల్స్‌ కాకుండా అడ్డుకోవడంలో సక్సెస్‌ అయిన కేరళ గోల్‌ కీపర్‌ సందేశ్‌ జిజ్నాస్‌ 'హీరో ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు.

వ్యూహం మార్చిన స్టీవ్‌

ఈ మ్యాచ్‌లో కేరళ బ్లాక్‌బస్టర్స్‌ పలు మార్పులు చేసింది. కోచ్‌ స్టీవ్‌ కొప్పెల్‌ సూచనల మేరకు మిఖైల్‌ చోఫ్రా నేతృత్వంలో తొలిసారి విదేశీ ఆటగాళ్లను ముందు అటాకింగ్‌కు నిలబెట్టారు. ఇండియన్‌ గోల్‌ కీపర్‌ సందీప్‌ నాందీని అదే స్థానంలో కొనసాగించినా విశ్లేషకులెవ్వరికి ఆసక్తికరమైన అంశంగా కనిపించలేదు.

ఈ సీజన్‌లో తన జట్టు తరుఫునగానీ, తాను వ్యక్తిగతంగా గానీ గోల్స్‌ కొట్టని మిఖైల్‌ చోప్రా ఈ మ్యాచ్‌లో తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నా పాయింట్‌ సాధించలేకపోయాడు. ప్రత్యేకించి ఢిల్లీ డిఫెన్స్‌ నుంచి పక్కకు తప్పించి తొలి హాఫ్‌ ముగింపునకు చివరి నిమిషంలో లాంగ్‌ బాల్‌ను కిక్‌ కొట్టినా ఢిల్లీ గోల్‌కీపర్‌ డొబ్లాస్‌ అడ్డుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X