హైదరాబాద్: ప్రీమియర్ లీగ్‌కు ప్రస్తుతం సుదీర్ఘకాల మేనేజర్‌గా సేవలందిస్తున్న ఆర్సెని వెంజర్ ఆదివారం 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన 70 ఏళ్ల క్రిస్టల్ ప్యాలెసెస్ రాయ్ హోడ్గొసన్ గత 21 ఏళ్లుగా నార్త్ లండనర్స్ జట్టుకు ఇన్‌ఛార్జిగా రికార్డు స్థాయిలో సేవలందిస్తున్నారు.
కాగా, తన పుట్టినరోజుని ఎలా జరపాలని వెంజర్‌ను అడిగినపుపడు ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. 'నాకు పుట్టినరోజులపై ఆసక్తి లేదు. నా ఆసక్తంతా ఫుట్‌బాల్‌పైనే. ఎప్పుడూ ఫుట్‌బాల్‌పైనే నా ధ్యాసంతా!' అని అన్నారు. ఇదిలా ఉంటే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్ కూడా పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపింది.

1996, అక్టోబర్ 1న వెంజర్ అర్సెనల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఆయన మార్గదర్శకత్వంలో గన్నర్స్ 1997-98 సీజన్‌లో తమ మొదటి ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుపొందారు. 2001-02లో మరోసారి ఆ జట్టు టైటిల్ గెలుపొందింది. 2003-04లో చరిత్ర సృష్టిస్తూ లీగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మూడోసారి ప్రీమియర్ లీగ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
వెంజర్స్ పర్యవేక్షణలో ఆర్సెనల్ జట్టు 38 మ్యాచ్‌ల్లో 90 పాయింట్లు సాధించింది. తమ జట్టు ఏడు ఎఫ్ఎ కప్‌లు గెలుచుకోవడంలో వెంజర్స్ తోడ్పడ్డారు. ఏ మేనేజర్‌కు సాధ్యం కాని విధంగా 1998, 2002, 2004లలో ఆయన అత్యుత్తమ మేనేజర్‌గా ఎంపికయ్యారు.
మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్‌గా 2012-13 సీజన్‌లో పదవీ విరమణ చేసిన సర్ అలెక్స్ ఫర్గ్యూసన్ తర్వాత ప్రీమియర్ లీగ్‌కు సుదీర్ఘ కాలం మేనేజర్‌గా సేవలందిస్తున్న వ్యక్తిగా వెంజర్ గుర్తింపు పొందారు.