కొపా డెల్ రేలో బార్సిలోనా వెనుకంజ: బిల్బావో విజయం
బిల్బావో: కొపా డెల్ రే టోర్నీలో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో లా లీగ జెయింట్స్ క్లబ్ బార్సిలోనాపై బిల్బావో విజయం సాధించింది. తద్వారా టెస్టిక్యులర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నయెరాయ్ అల్వారెజ్ కు అథ్లెటిక్ బిల్బావో జట్టు చిరస్మరణీయ బహుమతిని అందజేసింది. రెండు జట్ల మధ్య జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో 2-1 స్కోర్ తేడాతో విజయం సాధించింది.
ఇప్పటికీ టెస్టిక్యులర్ క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుంటున్న అల్వారెజ్‌కు సంఘీభావం తెలిపేందుకు సుమారు 50 వేల మంది అభిమానులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆతిథ్య బిల్బావో జట్టు ఫస్టాఫ్‌లో 2 - 0 స్కోర్ ఆధిక్యం సాధించింది. చివరి పది నిమిషాల్లో కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చినా బిల్బావోనే విజయం వరించింది.
తొలి 90 సెకన్లలోనే అథ్లెటిక్ బిల్బావో జట్టు తన ప్రత్యర్థి బార్సిలోనా ఎఫ్ సి క్లబ్ జట్టుకు ఝలక్ ఇచ్చింది. ఏనాడూ అలవాటు లేని 4-4-2 ఫార్ములాతో బరిలోకి దిగిన బాల్బావో.. విజిటర్స్ జట్టుకు తొలి 20 నిమిషాల్లో సదవకాశాలు కల్పించింది. కానీ బార్సిలోనా జట్టు దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.

25వ నిమిషంలో తొలి గోల్
హోం టీం 25వ నిమిషంలో తొలి గోల్ సాధించింది. కౌంటర్ అటాకింగ్ ద్వారా ఆర్టిజ్ అదురిజ్ హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్ దారి పట్టించింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే ఇనాకీ విలియమ్స్ సాయ పడటంతో అదురిజ్ మరో గోల్ చేయడంతో అట్లెటిక్ బిల్బావో 2 - 0 తేడాతో ఆధిక్యం సాధించింది. సెకండాఫ్ ప్రారంభమైన ఏడవ నిమిషంలో బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీ డైరెక్ట్ ఫ్రీ కిక్ ద్వారా చేసిన గోల్ రెండు జట్ల మధ్య స్కోర్ 2 - 1గా నమోదైంది.

రెండు గోల్స్ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు
దీంతో స్ఫూర్తి పొందిన విజిటర్స్ జట్టుకు రెండుసార్లుగోల్ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీనికి ముందు 72వ నిమిషంలో అట్లెటిక్ బిల్బావో ప్లేయర్ రాల్ గార్సియా తీవ్రంగా గాయపడటంతో రెండో ఎల్లో కార్డుతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. 80వ నిమిషంలో అథ్లెటిక్ బిల్బావో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. అండర్ ఇటుర్పాస్పేస్ కూడా రెండోసారి ఎల్లో కార్డు చవిచూడడంతో వైదొలగాల్సి వచ్చింది. అననుకూల వాతావరణంలో ఫైనల్ విజిల్‌కు ముందు మెస్సీ కొట్టిన షాట్ బౌన్స్ కావడంతో ఆతిథ్య అథ్లెటిక్ బిల్బావో జట్టుకు ఉపశమనం లభించింది.

మరో నాలుగు ఎడిషన్ల వరకూ ఎవర్టోన్‌తోనే లుక్‌మన్
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) క్లబ్ ఎవర్టోన్ ఎఫ్ సి యాజమాన్యం మరో నాలుగు ఎడిషన్ల పాటు చార్ల్‌టోన్ అథ్లెటిక్ స్ట్రయికర్ అడెమోలా లుక్‌మన్‌తో ఆడేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నది. ఇందుకు 13.6 మిలియన్ల డాలర్ల వేతనం చెల్లిస్తుంది. ఈ దఫా లీగ్ వన్ మూడో డివిజన్‌లో లుక్ మన్ 25 మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ సాధించాడు.

గర్వంగా, సంతోషంగా ఉంది
ఈ సందర్భంగా లుక్‌మన్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎవర్టోన్ ప్లేయర్ నైనందుకు గర్వంగా ఉందని, సంతోషంగా ఉన్నదన్నాడు. అభివ్రుద్ధి సాధించి, గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధించిన యువ ప్లేయర్లను చేర్చుకుంటున్నామని క్లబ్ వెబ్ సైట్ తెలిపింది. ప్రీమియర్ లీగ్ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని లుక్‌మన్ చెప్పాడు. చాంపియన్స్ షిప్ లీగ్‌లో, లీగ్ వన్ లో గత ఆరు నెలలుగా మంచి అనుభవం సాధించానన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications