ఫోటోలు: పోటెత్తిన అభిమాన జన ‘సందోహం’
కోచి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 3 ఎడిషన్ చాంపియన్ టైటిల్ కోసం జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు, మద్దతుదారులు కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంకు పోటెత్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు స్టేడియం గేట్లు తెరిచిన 15 నిమిషాల్లోనే అభిమానులతో నిండిపోయింది. టిక్కెట్లు దొరకని కుర్రాళ్లు స్టేడియం బయట ఫుల్ స్క్రీన్ల ముందు నిలబడి మ్యాచ్ వీక్షించడంతోనే సంత్రుప్తి పడాల్సి వచ్చింది.
60 వేల మందికి పైగా అభిమానులు ఐఎస్ఎల్ టైటిల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చారు. నగరంలోని మూడు ఫ్యాన్ పార్కుల వద్ద టీవీ స్ర్కీన్లు ఏర్పాటుచేసిన నిర్వాహకులు వేల మందికి లైవ్ మ్యాచ్ వీక్షించే అవకాశం కల్పించారు. ఇక కేరళ బ్లాక్ బస్టర్స్ జెర్సీ 'ఎల్లో షర్టుల'తో స్టేడియం నిండిపోయింది. హెడ్ బ్యాండ్లు మొదలు జెండాలు, పోస్టర్లు, ముఖంపై టీం పేర్ల పెయింటింగ్స్ గల ప్లేయర్లే ఎక్కువగా కనిపించారు.
కొందరు అభిమానులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట స్టేడియంలో పెవిలియన్ కూడా ఏర్పాటుచేశారు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలీ సమేతంగా హాజరై అభిమానులను అలరింపజేశాడు.
ఇక అట్లెటికో డి కోల్‌కతా సహ యజమాని సౌరవ్ గంగూలీ, ఐఎస్ఎల్ చైర్ పర్సన్ నీతా అంబానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు చెన్నైయిన్ ఎఫ్ సి సహ యజమాని అభిషేక్ బచ్చన్, ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితర ప్రముఖులు మ్యాచ్‌లో సెంటరాఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు.

యావరేజీగా 50 వేల మంది వీక్షకులు హాజరు
వచ్చేఏడాది జరిగే యు-17 వరల్డ్ కప్ నిర్వాహక స్టేడియంలలో ఒకటిగా నిలిచిన ఈ స్టేడియానికి ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్‌లో యావరేజీగా 50 వేల మంది వీక్షకులు హాజరు కాగా, ఫైనల్స్ కు గతేడాది చెన్నైయిన్ - ఎఫ్ సి గోవా మధ్య జరిగిన మ్యాచ్ కు 50 వేల మంది హాజరు కాగా, ఈ ఏడాది కోచి స్టేడియంకు 61,323 మంది అభిమానులు హాజరు కావడం రికార్డుగానే చెప్పుకోవచ్చు.

లక్ష మందికి పైగా వీక్షకులు హాజరై రికార్డు
ఫుట్‌బాల్ అభిమానులకు హాట్ బెడ్ గా పేరొందిన కోచి స్టేడియంలో 1997లో నెహ్రూ ఇంటర్నేషనల్ కప్ జరిగినప్పుడు ఇరాన్ - ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు లక్ష మందికి పైగా వీక్షకులు హాజరై రికార్డు నెలకొల్పారు. ఇటీవల కూడా ఇదే స్టేడియంలో పలు ఇంటర్నేషనల్ మ్యాచ్ లు జరిగినా ప్రజాదరణ శూన్యం.

ఇదో తొలిసారి
ఈ ఏడాది మార్చిలో తుర్కెమినిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో భారత్ 1 - 2 తేడాతో ఓటమి పాలైన మ్యాచ్‌కు గానీ, 2013లో పాలస్తీనాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ కు 40 వేల మంది మాత్రమే హాజరయ్యారు. 2014లో ఇండియా, వెస్టిండీస్ మధ్య అంతర్జాతీయ వన్ డే క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించారు. కానీ ఆదివారం జరిగిన ఐఎస్ఎల్ 3 టైటిల్ మ్యాచ్ తరహాలో అభిమానుల జన సందోహం పోటెత్తడం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు.

విజయన్ నిరుత్సాహం
దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ క్రీడకు ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఐఎస్ఎల్ టోర్నీలో మాజీ ఫుట్ బాల్ క్రీడాకారులను నిర్వాహకులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనికి ఉదాహరణ ఆదివారం జరిగిన మ్యాచ్ కోసం ప్రముఖ లెజెండ్ ఫుట్ బాలర్ ఐఎం విజయన్ పట్ల అనుసరించిన తీరే కారణం. సాధారణ అభిమాని మాదిరిగా రెండు టిక్కెట్లు కొనుక్కోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు.

నిర్వాహకులు పట్టించుకోలేదని ఆవేదన
ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు తాను, తన కొడుకు రెండు సాధారణ టిక్కెట్లు కొనుక్కోవాల్సిన ఆగత్యం ఏర్పడిందన్నాడు. బ్లాక్ లో టిక్కెట్లు విరివిగా విక్రయించినా నిర్వాహకులు పట్టించుకోలేదన్నాడు. ఆయన అర్జున అవార్డు గ్రహీత, 1993, 1997, 1999లలో ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గ్రహీత కూడా. ఈ అవార్డును పలుసార్లు గెలుచుకున్న ఏకైక భారతీయ ప్లేయర్ కూడా.

కేరళ జట్టుపై రూ.6 లక్షల ఫైన్
కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి ఫ్రాంచైసీపై ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా కమిటీ రూ.6 లక్షల జరిమానా విధించింది. లీగ్ దశలో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జట్టు దుష్ర్పవర్తన, ప్రేక్షక పాత్ర పోషించినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. ఐదుగురు కేరళ ప్లేయర్లపై ఆంక్షలతోపాటు రూ. 2 లక్షల ఫైన్ విధించింది.

నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుపై దుష్ప్రర్తన
సెమీ ఫైనల్స్ కు వెళ్లే దశలో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో దుష్ప్రర్తనతో వ్యవహరించినందుకు రూ.4 లక్షల జరిమాన విధించిన ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా కమిటీ మొత్తం రూ. 6 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications