Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెద్దోళ్లతో భారత ఫుట్‌బాల్‌కే మేలు: రొనాల్డోకు అహంకారమెందుకు?

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పేరు ఉన్న కొంతమంది పెద్ద క్రీడాకారులు భాగస్వాములు కావడంతో భారతీయ ఫుట్‌బాల్ ప్రొఫైల్ పెరుగుదలకు దోహదపడుతుందని ఫ్రాన్స్ మాజీ స్ట్రయికర్, బెల్జియం అసిస్టెంట్ కోచ్ థియర్రీ హెన్రీ వ్యాఖ్యానించాడు. భారత్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్నహెన్రీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ అటువంటి పెద్ద క్రీడాకారులు లీగ్‌లో పాల్గొనడం వల్ల సామూహికంగా సహకరిస్తుందన్నాడు.

ప్రముఖ క్రీడాకారుల భాగస్వామ్యంతో చాలా మంది యువ క్రీడాకారులను అభివ్రుద్ధి చేసుకోవచ్చునని, అది సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుందన్నాడు. ఐఎస్ఎల్‌లో ప్రపంచ అగ్రశ్రేణి ఫుట్‌బాల్ క్రీడాకారులు జికో, రోబర్టో కార్లోస్, లుసియో, రాబర్ట్ పైర్స్, ఫ్రెడ్డీ లుంగ్ బర్గ్, డేవిడ్ ట్రీజ్ క్వైట్, అలెస్సాండ్రో డెల్ పైరో, ఎలానో బల్మర్, హెల్డర్ పొస్టిగ, ఆడ్రియన్ ముటు, నికోలస్ అనెల్కా తదితరులు ఐఎస్ఎల్ టోర్నీలో పూర్తిగా భాగస్వాములైన సంగతి తెలిసిందే.

తాను అట్లిటికో డీ కోల్ కతా, ముంబై సిటీ మధ్య కోల్ కతాలో జిగిన మ్యాచ్ ను వీక్షించానని, గోల్ చేస్తేనే గేమ్‌లో విజయం సాధిస్తారని, అది చివరి దశలో గోల్ పాయింట్ సాధించడం మినహా భారత్ లో సానుకూల వాతావరణం ఉందన్నాడు. ఇది ఫుట్ బాల్ గేమ్ కు చాలా మంచిదని, ఇద్దరు గోల్ కీపర్లతోపాటు ముంబై సిటీ సారధి డియాగో ఫోర్లాన్ వంటి వారి ఆటతీరు చాలా బాగుందని ప్రశంసించాడు.

Big names in ISL will increase profile of Indian football: Thierry Henry

మొలీనాపై ఒక మ్యాచ్ వేటు
అట్లెటికో డీ కోల్‌కతా జట్టు కోచ్ జోన్ మొలీనాపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. టోర్నమెంట్ సమయంలో దుష్ర్పవర్తనకు పాల్పడినందుకు సస్పెన్షన్ వేటు వేసినట్లు ఐఎస్ఎల్ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. మంగళవారం ముంబై సిటీ ఎఫ్ సి జట్టుతో జరిగిన మ్యాచ్ సెకండాఫ్‌లో రిఫరీ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని కోల్ కతా జట్టు సభ్యులను మొలీనా ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై ఐఎస్ఎల్ క్రమశిక్షణా కమిటీ మొత్తం అంశాన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా ఆయన శుక్రవారం నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా కోడ్ (ఆర్టికల్ 19) ప్రకారం ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ అమలులోకి వస్తుందని ఐఎస్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.

రొనాల్డోకు అంత అహంకారమెందుకు?
స్పానిష్ లీగ్ 'లా లీగా' టోర్నీలో జెయింట్స్ క్లబ్ రియల్ మాడ్రిడ్ ప్రధాన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వ్యవహారశైలిపై సహచర ఆటగాళ్లు నిప్పులు కక్కుతున్నారు. అంత స్వార్థం, అహంకారం, సొంత అభిప్రాయాలు ఎందుకని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

వివిధ వర్గాల సమాచారం పేరుతో 'ముండో డెపోర్టివో'అనే మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం పలువురు రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు.. తమ సహచరుడి స్వార్థ పూరిత వైఖరిపై చికాకుపడుతున్నారని తెలుస్తున్నది. గత వారం ఫ్యాన్స్ ఆకాంక్షల్లో ఆయన పేరు ముందు వరుసలో నిలిచినప్పటి నుంచి బిహేవియర్ మారిపోయిందని వారు మండిపడుతున్నారు.

ఈ నెల 17న ట్రైనింగ్ సమయంలో సహచర ప్లేయర్ జేమ్స్ రోడ్రిగ్స్‌తో సంవాదానికి దిగితే మరో ప్లేయర్ మార్సెల్లో జోక్యంచేసుకుని విడిపించాడు. గత ఆదివారం అట్లెటిక్ బిల్బావోపై మ్యాచ్ జరుగుతున్నప్పుడు చివరి నిమిషాల్లో బంతిని పాస్ చేయకుండా తన వద్దే అట్టి పెట్టుకోవడంపై టోనీ క్రూస్ తీవ్ర అసంత్రుప్తి వ్యక్తంచేశాడు.

తనకు గానీ, మొరాటాకు గానీ బంతిని పాస్ చేయకుండా రొనాల్డో మొండిగా వ్యవహరించాడని క్రూస్ అభిప్రాయం. రొనాల్డోపై విమర్శలు చేస్తున్న వారిలో గారెథ్ బాలే, లుకా మోర్డిక్, మార్కోఅసెంసియో, మొరాటా కూడా వచ్చి చేరారని ఓ వెబ్ సైట్ పేర్కొంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+