Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగళూరుకు హర్మాన్‌జోత్‌ సింగ్ ఖాబ్రా జోడీ

బెంగళూరు: ఐ-లీగ్ చాంపియన్స్ బెంగళూరు ఎఫ్‌సి యాజమాన్యం అనుభవం కలిగిన ఫుట్‌బాల్ ఆటగాడు మిడ్ ఫీల్డర్ హర్మాన్‌జోత్ ఖబ్రాతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సుదీర్ఘకాలం ఆడేందుకు ఒప్పందం చేసుకున్నఈ 28 ఏళ్ల కుర్రాడు ఇక నుంచి ఐ-లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సి జట్టుకు కూడా సేవలందించనున్నాడు.

'నన్ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నందుకు బెంగళూరు ఎఫ్‌సి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతీయ చాంపియన్లు తనను ఎంచుకున్నందుకు నేను తప్పనిసరిగా ఏదో కొంత సరిగా ఆడాలి. ఇది నా కెరీర్‌లో నూతన శకం కానున్నది. నేను దీన్ని గుర్తుండిపోయేలా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. సునీల్ ఛెత్రి, ఎగ్యునెసన్ లింగ్డో తదితరులతో కలిసి ట్రోఫీ గెలుచుకోవడంలో బెంగళూరు ఎఫ్‌సి జట్టుకు నా వంతు సాయం అందిస్తా' అని హర్మాన్ జోత్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపాడు.

ఇంతకుముందు ఆయన ఏడు సీజన్లలో ఈస్ట్ బెంగాల్ తరఫున ఆడాడు. కొన్నిసార్లు కోల్ కతా క్లబ్ సారథిగా కూడా వ్యవహరించాడు. బెంగళూరు ఎఫ్ సి కోచ్ అల్బర్ట్ రోచా మాట్లాడుతూ హర్మాన్‌జోత్ సింగ్ వంటి ప్లేయర్ల రాక తమ జట్టుకు మరింత శక్తినిస్తుందన్నారు. ఐ - లీగ్ టైటిల్ ను కాపాడుకోవడంతోపాటు ఏషియాన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) చాంపియన్ లీగ్ ఆకాంక్షను సజీవంగా నిలుపుతుందన్నాడు.

హర్మాన్‌జోత్ సింగ్ చాలా అనుభవం కలిగిన ప్లేయర్: రోచా

హర్మాన్‌జోత్ సింగ్ చాలా అనుభవం కలిగిన ప్లేయర్: రోచా

‘హర్మాన్‌జోత్ సింగ్ చాలా అనుభవం కలిగిన ప్లేయర్. ప్రతి సీజన్‌లోనూ జట్టు దూసుకెళ్లడంలో చాలా ఉపయోగంగా ఉంటాడు. తమ ముందు క్లిష్టతరమైన క్యాలెండర్ ఉన్నందున బిజీబిజీగా గడపాల్సి ఉంటుంది. హర్మాన్ జోత్ సింగ్ చేరిక మాకు చాలా ముఖ్యం. ఆయనలో గల వ్యూహాలు, ట్రిక్కులు ప్రత్యేకించి ఇన్ సైడ్ బాక్స్‌లో తప్పక ఉపయోగపడతాయి' అని రోచా చెప్పాడు. బెంగళూరు ఎఫ్ సి యాజమాన్యంతో కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకం చేయడంతోపాటు సోమవారం నుంచే మొదలైన తొలి శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నాడు.

మరిన్ని గోల్స్ కావాలంటున్న చెల్సియా స్ట్రయికర్ డియాగో కోస్తా

మరిన్ని గోల్స్ కావాలంటున్న చెల్సియా స్ట్రయికర్ డియాగో కోస్తా

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో బెస్ట్ పెర్పార్మెన్స్ ప్రదర్శించకున్నా చెల్సియా స్ట్రయికర్ డియాగో కోస్తా ప్రత్యర్థి జట్లకు వ్యతిరేకంగా అత్యధిక గోల్స్ చేయాలని సహచర ప్లేయర్లకు పిలుపునిస్తున్నాడు. ఇప్పటివరకు ఇపిఎల్ టోర్నీలో 12 గోల్స్‌లో టాప్ స్థానంలో నిలిచిన చెల్సియా ఆదివారం వెస్ట్ బ్రూమ్‌విచ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోస్తా గోల్‌తోనే విజయం సాధించగలిగింది. ఇది టోర్నీలో చెల్సియాకు వరుసగా తొమ్మిదో విజయం. ఒకవేళ 15 గేమ్స్ లో 12 గోల్స్ సాధించడం అద్భుతమైన ఆట తీరు కావచ్చు కానీ అది సరిపోదని, మరిన్ని గోల్స్ చేయాల్సి ఉన్నదని కోస్తా వ్యాఖ్యానించాడు.

మంచి ఫామ్‌లో ఉన్నా: కోస్తా

మంచి ఫామ్‌లో ఉన్నా: కోస్తా

తాను మెరుగైన ప్రతిభ కనబర్చకున్నా మంచి ఫామ్‌లో ఉన్నానని తెలిపాడు. ఆదివారం నాటి విజయంతో 15 మ్యాచ్ లలో 34 పాయింట్లతో చెల్సియా ఇపిఎల్ టోర్నీలో టాప్ స్థానంలో నిలవగా, తర్వాతీ స్థానంలో ఆర్సెనల్ పోటీ పడుతున్నది. ఆంటోనియో కాంటే మార్చిన 3 - 4 - 3 ఫార్మాట్ తో జట్లు ప్లేయర్లు డిఫెన్సివ్‌గా ఆడుతున్నందుకు ప్రశంసించాడు. ఇది ప్రస్తుత సీజన్ లో సరైన వ్యూహమేనన్నాడు. అటాకింగ్ వ్యూహమే డిఫెండ్ చేసుకోవడానికి సహకరిస్తుందని చెప్పాడు. సెస్క్ ఫాబ్రేగాస్ అందించిన పాస్‌ను గోల్‌గా మార్చిన కోస్తా.. అందుకు తన సహచర ప్లేయర్‌కే క్రెడిట్ దక్కుతుందన్నాడు. ప్రతి పాస్ కూడా తాను టర్నింగ్ పాయింట్ తీసుకోవడానికి ఉపకరిస్తున్నదని అన్నాడు.

మాంఛెస్టర్ సిటీ గాబ్రియల్‌కు బ్రెజిలియన్ గోల్డెన్ బాల్ అవార్డు

మాంఛెస్టర్ సిటీ గాబ్రియల్‌కు బ్రెజిలియన్ గోల్డెన్ బాల్ అవార్డు

పాల్మైరియాస్ స్ట్రయికర్ గాబ్రియల్ జీసస్ సరికొత్త గౌరవాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది బ్రెజిలియన్ సిరీస్ ఎ గోల్డెన్ బాల్ అవార్డు అందుకున్నాడు. 22 ఏళ్లలో తొలిసారి సావో పాలోలో పాల్మైరియాస్ జట్టు చాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. వచ్చే జనవరిలో మాంఛెస్టర్ సిటీ జట్టుతో జత కలువనున్నాడు. వెర్డావోలో జరిగిన ఫైనల్స్ లో పాల్గొన్న గాబ్రియల్ తన బాయ్ హుడ్ క్లబ్ తరఫున 12 గోల్స్ సాధించినందుకు బహుమతి గెలుచుకున్నాడు. దీంతో గాబ్రియల్ జీసస్.. బోలా డీ ఔరో ఎంపికచేసిన గ్రూప్ టీం రొమారియో, రొనాల్డిన్హో, నేయ్మార్, రాబర్టో డినమైట్, పెలె, జికో సరసన గాబ్రియల్ జీసస్ చోటు దక్కించుకోనున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+