న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

టైటిళ్ల కైవసం బెంగళూరు ఎఫ్‌సీ అలవాటు: గుర్‌ప్రీత్ సింగ్

 Bengaluru FC Have Made Winning a Habit: Gurpreet Singh Sandhu

హైదరాబాద్: ఐదేళ్ల క్రితం భారతీయ ఫుట్‌బాల్ పరిధిలో ఆవిర్భవించిన పసికందు. దాని పేరు బెంగళూరు ఎఫ్‌సీ క్లబ్. నాటి నుంచి ఈనాటి వరకు ప్రతియేటా ట్రోఫీ గెలుచుకోవడమే అలవాటుగా మార్చుకుంది. అదే ఐ - లీగ్ టైటిల్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది బెంగళూరు ఎఫ్‌సీ. గతంలో ఫెడరేషన్ కప్.. మధ్యలో ఐ లీగ్.. తాజాగా ఇండియన్ సూపర్ కప్.. పేరేదైనా టోర్నీ టైటిల్ ఖచ్చితంగా బెంగళూరు ఎఫ్‌సీ జట్టుదే.

నిలకడగా ఆడుతూ బెంగళూరు ఎఫ్సీ ముందడుగు

నిలకడగా ఆడుతూ బెంగళూరు ఎఫ్సీ ముందడుగు

వరుసగా ప్రతియేటా టైటిళ్లు గెలుచుకున్నట్లే బెంగళూరు ఎఫ్‪సీ మంచి నాణ్యతతో నిలకడగా ఆడుతూ ఫుట్‌బాల్ మ్యాచ్‍ల్లో విజయాలు సాధిస్తోంది. తద్వారా దేశీయ ఫుట్‌బాల్ రంగంలో అజేయంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా బెంగళూరు ఎఫ్‌సీ గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ మాట్లాడుతూ ‘ప్రారంభంలో ఏ ఒక్కరూ కూడా మా క్లబ్ విజయాల బాటన పయనిస్తుందని ఊహించలేదు. కానీ ఈ క్లబ్ జట్టు టైటిల్ కప్ ప్రతియేటా గెలుచుకుంటూ విజయాన్ని అలవాటుగా మార్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. గెలుపే లక్ష్యంగా పై నుంచి కింది వరకు సింపుల్‌గా ఉంటూ ముందుకు సాగుతున్నది' అని చెప్పాడు.

ఏ టోర్నమెంట్‌నూ తేలిగ్గా తీసుకోలేదన్న గుర్‌ప్రీత్ సింగ్

ఏ టోర్నమెంట్‌నూ తేలిగ్గా తీసుకోలేదన్న గుర్‌ప్రీత్ సింగ్

తాము ఏ టోర్నమెంటును కూడా అంత తేలిగ్గా తీసుకోలేదని గుర్ ప్రీత్ సింగ్ సంధూ పేర్కొన్నాడు. సూపర్ కప్ టోర్నీలో పాల్గొన్న జట్లేవీ వాటి పూర్తిస్థాయికి అనుగుణంగా ఆడలేదని తెలిపాడు. తాము సీజన్ అంతటా చాలా మెరుగ్గా ఆడుతూ విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పాడు. కానీ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్ టైటిల్ కోసం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్ సీ చేతిలో ఓటమి పాలవ్వడం తప్పనిసరిగా నిరాశకు గురి చేసిందన్నాడు. దానివల్లే సూపర్ కప్ టైటిల్ గెలుచుకున్నామని గుర్ ప్రీత్ సింగ్ సంధూ వివరించాడు.

చెన్నైయిన్‌కు ఐఎస్ఎల్ టైటిల్ నిరాశాజనకం

చెన్నైయిన్‌కు ఐఎస్ఎల్ టైటిల్ నిరాశాజనకం

ఇటీవలే దేశీయంగా ఫుట్‌బాల్ టోర్నీలు ముగించుకున్న బెంగళూరు ఎఫ్‌సీ.. చెన్నైయిన్ ఎఫ్ సీ జట్టుకు ఐఎస్ఎల్ టైటిల్ ఓటమి పాలైనా ఇండియన్ సూపర్ లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచింది. భువనేశ్వర్‌లో మొదలైన సూపర్ కప్ టోర్నీలో సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‪సీ జట్టు ఫైనల్స్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టుపై 4 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.

నెరోకా మినహా అన్ని క్లబ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో గోల్స్ సాధిస్తూ విజయ పరంపర సాగించింది బెంగళూరు ఎఫ్ సీ. ఫైనల్స్‌లో అందుకు భిన్నమైన పరిస్థితేమీ కాదు. తొలి అర్థభాగంలో ఈస్ట్ బెంగాల్ కొనసాగించిన లీడ్‌ను తర్వాత 15 నిమిషాల్లో దాటేసిన నేపథ్యంలో బెంగళూరు ఎఫ్ సీది.

సునీల్ చెత్రి, మికుల్లో ఒకరు గోల్ చేస్తారని తెలుసు

సునీల్ చెత్రి, మికుల్లో ఒకరు గోల్ చేస్తారని తెలుసు

సునీల్ ఛెత్రి గానీ, మికూ గానీ గోల్స్ చేసేందుకు అవకాశాలు స్రుష్టిస్తారని తామంతా ఎల్లవేళలా ఎంతో విశ్వాసంతో ఉండేవారనమి తెలిపారు. కానీ ఫైనల్స్ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు ప్రదర్శించిన తీవ్రతతో కూడిన దాడిని కొనసాగించడంతో తాము ఎదుర్కోవడం కష్ట సాధ్యంగా మారిందని గుర్ ప్రీత్ సింగ్ చెప్పాడు. తాము చాలా ఓపిగ్గా వ్యవహరించామని తెలిపాడు. గుర్ ప్రీత్ సింగ్ గోల్ కీపర్‌గా బెంగళూరు ఎఫ్‌సీ జట్టు గెలుచుకున్న తొలి టైటిల్ ఇదే. ‘ఐ - లీగ్ జట్లు చాలా బాగా ఆడినవి. సూపర్ కప్ గొప్ప టోర్నమెంట్. కానీ ఆటగాళ్లందరికీ క్లిష్టంగా మారింది. అందువల్లే చాలా మంది ఫుట్‌బాల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు రాలేకపోతున్నారు' అని గుర్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. భువనేశ్వర్ లో సూపర్ కప్ టోర్నీ సందర్భంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు ఉండటం పట్ల పలువురు క్రీడాకారులు సోషల్ మీడియాలో తమ మనోభావాలు వ్యక్తం చేశారు.

ఉదాంత సింగ్ ఒక బ్రిలియంట్ ప్లేయర్

ఉదాంత సింగ్ ఒక బ్రిలియంట్ ప్లేయర్

తాజాగా ముగిసిన సీజన్‌లో ఉదాంత సింగ్ చాలా బ్రిలియంట్ ప్లేయర్. ఈ సీజన్ మ్యాచ్‌ల్లో అటాకింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. వేగంగా రియాక్టు కావడంలో చురుగ్గా స్పందించిన ఉదాంతా సింగ్‌ను మికు, సునీల్ చెత్రి వంటి ప్లేయర్ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. గుర్‌ప్రీత్ సింగ్, ఇతర బెంగళూరు ఎఫ్ సీ క్లబ్ సభ్యులు మాల్దీవులలో బుధవారం జరుగనున్న న్యూ రేడియంట్ స్పోర్ట్స్ క్లబ్ జట్టుతో తలపడేందుకు బయలుదేరి వెళ్లింది. బెంగళూరు ఎఫ్‌సీ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడంతో అదే ఊపులో ముందుకు సాగుతోంది. ‘మేం ఏఎఫ్సీ కప్ టోర్నమెంట్ లో చాలా బాగా ఆడాం. గతేడాది చాలా క్లిష్టతరమైన మ్యాచ్‌ల్లో ఆడాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జట్లు శక్తిమంతంగా ఎదిగి మెరుగైన స్థానానికి చేరుకున్నది' అని అని గుర్ ప్రీత్ సింగ్ తెలిపాడు.

Story first published: Wednesday, April 25, 2018, 13:25 [IST]
Other articles published on Apr 25, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X