Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాష్‌బ్లాక్ 2016: బెంగళూరు సంచలనం, భారత్ మోస్తరు ప్రదర్శన

బెంగళూరు: ఐ-లీగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి సంచలనాలతో మరో మెట్టు పైకెగబ్రాకితే.. మోస్తరు ప్రతిభ ప్రదర్శనతో జాతీయ ఫుట్ బాల్ టీం ర్యాంకింగ్‌లో ముందడుగు వేయడం భారత్ సాకర్ చరిత్రలో 2016 కీలకంగా నిలిచిపోనున్నది. మరోవైపు వచ్చే ఏడాది భారత్‌లో తొలిసారి ఫిఫా యు - 17 వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వసతుల కల్పనలో అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉన్నది.

ఇక పదేళ్లుగా కొనసాగుతూ వచ్చిన ఐ - లీగ్ టోర్నీ భవితవ్యంపై నిరంతర చర్చ సాగుతున్నది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) రెండంచెల టోర్నమెంట్ల నిర్వహణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐ - లీగ్ రెండో స్థానాన్ని ఆక్రమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం కార్పొరేట్ సంస్థల దన్నుతో ప్రారంభించిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీని దేశవాళీ ప్రధాన టోర్నీగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నది.

ఎఎఫ్‌సి టైటిల్ పోరులో బెంగళూరు ఎఫ్‌సి

ఎఎఫ్‌సి టైటిల్ పోరులో బెంగళూరు ఎఫ్‌సి

ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి)తో సరి సమానమైన టోర్నీ యూరప్ లీగ్‌లో నార్వేయన్ క్లబ్ స్టాబాక్ ఎఫ్ సి తరఫున గోల్ కీపర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయుడు గురుప్రీత్ సింగ్ వ్యక్తిగత హోదాలో వెలుగుతుండగా, అనూహ్య రీతిలో ఎఎఫ్‌సి టైటిల్ పోరులో తలపడిన తొలి ఇండియన్ క్లబ్ జట్టుగా బెంగళూరు ఎఫ్ సి నిలిచింది. భారత్ లోనే బెస్ట్ జట్టుగా పేరు తెచ్చుకున్న బెంగళూరు ఎఫ్ సి బ్లూస్ ఎఎఫ్‌సి సెమీ ఫైనల్స్‌లో మలేషియాకు చెందిన క్లబ్ జోహోర్ దారుల్ తాజిమ్ జట్టుపై విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో ఫ్యాన్స్‌ను అలరించింది.

స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబర్చిన బెంగళూరు ఎఫ్‌సి

స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబర్చిన బెంగళూరు ఎఫ్‌సి

ఇరాకీ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్టుతో జరిగిన టైటిల్ పోరులోనూ 1 - 0 స్కోర్ తేడాతో ఓటమి పాలైనా మాజీ బార్సిలోనా కోచ్ అల్బర్ట్ రోచా శిక్షణలో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబరిచిందీ బెంగళూరు ఎఫ్ సి.

మరోవైపు బ్రిటిష్ - సైప్రస్ కోచ్ స్టీఫెన్ కాంస్టాటైన్ సారథ్యంలో ఇండియన్ నేషనల్ టీం ఆప్ఘనిస్థాన్ నుంచి ఎస్ఎఎఫ్ఎఫ్ టైటిల్ ను గెలుచుకున్నా.. గ్రూప్ దశలో దిగువ స్థాయిలోనే కొనసాగుతూ వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించలేక చతికిల పడింది. ఇక ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత్ ఆరేళ్లలో 135వ స్థానానికి ఎగబ్రాకడం విశేషమే. అంతకుముందు సెప్టెంబర్‌లో పైర్టో రికో జట్టుపై విజయంతో ఆ నెలలో 230 పాయింట్లు పొందింది. ఫిఫా ర్యాంకింగ్స్‌పై విమర్శలు ఉన్నా గతేడాది బెల్జియం రెండో స్థానంలో నిలవగా, సంప్రదాయ సమస్యల కారణంగానే భారత్ కొద్ది ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో మాత్రమే పాల్గొనడం ఇబ్బందికరమే.

దేశీయ టోర్నీలో అట్లెటికో డి కోల్ కతా రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్

దేశీయ టోర్నీలో అట్లెటికో డి కోల్ కతా రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్

దక్షిణాసియాలో నేపాల్ జట్టుపై మెన్స్ యు - 23 జట్టు ఫైనల్స్ లో ఓటమి పాలైనా అంతకుముందు లీగ్ దశలో ఇదే నేపాల్ జట్టును 4 - 0 స్కోర్ తేడాతో ఓడించడం ఉపశమనంగానే భావించొచ్చు. ఇక దేశీయ టోర్నీలో అట్లెటికో డి కోల్ కతా రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా అత్యంత నిలకడైన జట్టుగా నిలిచింది. జోస్ మొలీనా శిక్షణలో ఎనిమిది మ్యాచ్ ల్లో డ్రాగా ముగించుకుని మూడు సీజన్లలో అత్యున్నత స్థానంలో నిలిచిన కోల్ కతా జట్టు.. సెమీ ఫైనల్స్ లో తొలిసారి అడుగు పెట్టిన ముంబై సిటీ ఎఫ్ సి జట్టును, రెండోసారి ఫైనల్స్‌కు చేరుకున్న కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టును ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కానీ ఐఎస్ఎల్ టోర్నీ ప్రమాణాల పరంగా దెబ్బతిన్నది.

వచ్చే ఏడాది భారత్‌లో యు-17 వరల్డ్ కప్

వచ్చే ఏడాది భారత్‌లో యు-17 వరల్డ్ కప్

అభిమానులకు బోర్ మిగిల్చిందనే చెప్పాలి. వచ్చే ఏడాది యు - 17 వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీని ప్రధాన టోర్నీగా తీర్చిదిద్దేందుకు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్), ఐఎస్ఎల్ నిర్వాహక సంస్థ ‘ఎఫ్ఎస్‌డిఎల్'ను అడ్డుకునే వారే ఉండకపోవచ్చు. ఐ - లీగ్ టోర్నీలో ఇప్పటివరకు పాల్గొన్న గోవా క్లబ్ లు వైదొలగడమే దీనికి కారణం. ఐదుసార్లు ఐ - లీగ్ గెలుచుకున్న డెంపో, 60 ఏళ్ల క్లబ్ సాల్గావోకర్, స్పోర్టింగ్ క్లబ్ డీ గోవా జట్లు ఈ ఏడాది నుంచి ఐ లీగ్ కు దూరమని ప్రకటించాయి. వచ్చే ఏడాది తొలిసారి యు - 17 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో జర్మన్ కోచ్ నికోలయి ఆడం సారథ్యంలో భారత్ జట్టు శిక్షణ పొందుతున్నది. బ్రెజిల్ లో వారి పెర్పార్మెన్స్ మెరుగ్గా ఉంది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే యు - 17 వరల్డ్ కప్ పైనే అంతా కేంద్రీకరించారు.

కొపా అమెరికా టోర్నీ టైటిల్‌ని గెలిచిన అర్జెంటీనా జట్టు

కొపా అమెరికా టోర్నీ టైటిల్‌ని గెలిచిన అర్జెంటీనా జట్టు

అంతర్జాతీయంగా యూరో 2016 క్లబ్ గెలుచుకున్న పోర్చుగల్ జట్టుకు బూస్ట్ కాగా, క్రిస్టియానో రొనాల్డో ప్రత్యర్థి లియానెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు.. కొపా అమెరికా టోర్నీ టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని మరోసారి కోల్పోయింది. దీని ప్రభావంతో తొలుత అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచే వైదొలుగుతానని నైరాశ్యంతో ప్రకటించిన మెస్సీ.. తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇక చాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా గెలుచుకున్న రియల్ మాడ్రిడ్ హీరో క్రిస్టియానో రొనాల్డో వరుసగా నాలుగో ఏడాది.. ఫిఫా బాల్లోన్ డి' ఓర్ అవార్డును గెలుచుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+