For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: బ్రెజిల్ రికార్డు సమం చేసిన బెల్జియం.. కెనడాపై ఉత్కంఠ విజయం!

Belgium narrowly wins over Canada to equal Brazil record of eight consecutive wins in World Cup group stage

ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా కెనడా, బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్‌లో బెల్జియం విజేతగా నిలిచింది. ఆట ఆరంభమైన దగ్గరి నుంచి జోరు మీద కనిపించిన కెనడా జట్టు.. ఎన్నో అవకాశాలను సృష్టించుకుంది. కానీ చివరకు వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. అదే సమయంలో తనకు దక్కిన ఏకైక అవకాశాన్ని బెల్జియం ప్లేయర్ మిచీ బాట్సుషాయి గోల్‌గా మలిచాడు. దీంతో తొలి అర్థభాగం చివర్లో బెల్జియం 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు బెల్జియం ఆటగాడు యానిక్ కారస్కో.. బాక్సులో చేసిన తప్పిదం వల్ల అతనికి ఎల్లో కార్డ్ చూపించడంతోపాటు కెనడాకు పెనాల్టీ కిక్ కూడా లభించింది. అయితే బెల్జియం గోల్ కీపర్ థిబాట్ కర్టాయిస్ సరిగ్గా గెస్ చేసి గోల్ అడ్డుుకున్నాడు. ఇది ఆ జట్టుకు దొరికిన సులభమైన అవకాశం. దాన్ని కూడా కెనడా ఉఫయోగించుకోలేకపోయింది. ఆ తర్వాత కష్టపడి సృష్టించుకున్న అవకాశాలను కూడా కెనడా ఉపయగించుకోలేకపోయింది. తొలి హాఫ్‌లో ఆధిక్యంలో నిలిచిన బెల్జియం జట్టు.. రెండో అర్ధభాగం మొదలైన తర్వాత ఉత్సాహంగా కనిపించింది.

Belgium narrowly wins over Canada to equal Brazil record of eight consecutive wins in World Cup group stage

మొదటి అర్ధభాగంతో పోలిస్తే వాళ్ల ఆటతీరు కూడా మెరుగైంది. కెనడా కూడా చాలా బాగా పోరాడింది. కానీ గోల్స్ సమం చేయడంలో విఫలమైంది. ఈ విజయంతో గ్రూప్-ఎఫ్‌లో తొలి విజయం సాధించిన జట్టుగా బెల్జియం నిలిచింది. ఈ ఉత్కంఠభరిత విజయంతో బెల్జియం జట్టు మరో రికార్డు సృష్టించింది. ఫిపా వరల్డ్ కప్ గ్రూప్ దశలో వరుసగా 8 విజయాలు సాధించిన జట్టుగా బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డును సమయం చేసింది.

Belgium narrowly wins over Canada to equal Brazil record of eight consecutive wins in World Cup group stage

ఆ జట్టు మిడ్‌ఫీల్డర్ కెవిన్ డి బ్రూన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అలాగే ఈ గ్రూప్‌లో మూడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకుముందు ఈ గ్రూప్‌లో క్రొయేషియా, మొరాకో కూడా తలపడ్డాయి. కానీ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఆ రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది.

Story first published: Thursday, November 24, 2022, 11:13 [IST]
Other articles published on Nov 24, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+