Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి: ఫిఫా ర్యాంకింగ్స్‌లో రెండు జట్లు అగ్రస్థానంలో

France And Belgium Are First-Ever Joint Ranking Leaders
Belgium Joins France To Become First Joint-leaders In FIFA Ranking History

హైదరాబాద్: ఫిఫా ర్యాంకింగ్స్‌లో రెండు జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. ఫిఫా శుక్రవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 2018 వరల్డ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టుతో సహా బెల్జియం జట్టు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి. జట్టు ర్యాకింగ్స్‌లో ఇలా రెండు దేశాలు తొలి స్థానంలో నిలవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి.

రష్యా వేదికగా ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో బెల్జియం జట్టు సెమీఫైనలిస్ట్ స్థానంతోనే సరిపెట్టుకోగా ... ఫ్రెంచ్ జట్టు విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రష్యా వరల్డ్ కప్‌లో అంచనాలకు మించి రాణించిన ఫ్రెంచ్ జట్టు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

రష్యాలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టు క్రొయేషియాపై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి రెండోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. దీని ఫలింతగా ఫిఫా తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 16 ఏళ్ల తర్వాత అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

మరోవైపు యూరోపియన్ లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఐస్‌ల్యాండ్‌ను ఓడించి బెల్జియం రేటింగ్ పాయింట్స్ మెరుగుపరుచుకుంది. ఫ్రాన్స్‌తో సమానంగా 1729 రేటింగ్ పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 1993 తర్వాత రెండు జట్లు ఇలా అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

క్రొయేషియా జట్టు నాలుగో స్థానానికి పడిపోగా, ఐదు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ 3వ స్థానంలో నిలిచింది. ఇక ఉరుగ్వే, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, స్పెయిన్, పోర్చుగల్ జట్టు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.

టాప్ 10 ర్యాంకింగ్స్:
1. ఫ్రాన్స్
2. బెల్జియం
3. బ్రెజిల్
4. క్రొయేషియా
5. ఉరుగ్వే
6. ఇంగ్లాండ్
7. పోర్చుగల్
8. స్విట్జర్లాండ్
9. స్పెయిన్
10. డెన్మార్క్

Story first published: Friday, September 21, 2018, 15:18 [IST]
Other articles published on Sep 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+