వ్యక్తిగత బహుమతి గెలిచి చాలా రోజులైంది: ఫిఫా ప్లేయర్ అవార్డుపై మెస్సీ భావోద్వేగం

హైదరాబాద్: "వ్యక్తిగత బహుమతి గెలుచుకుని చాలా రోజులైంది" ఉత్తమ ఫిఫా ప్లేయర్ అవార్డు అందుకున్న తర్వాత అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ అన్న మాటలివి. 2019 సంవత్సరానికి ఫిఫా గురువారం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటలీలోని మిలన్‌లో ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది.
ఇందులో లియోనల్ మెస్సీ 6వసారి ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2015లో లియోనల్ మెస్సీ తన ఐదో బాలిన్ డీ ఓర్ అవార్డు అందుకున్న తర్వాత అందుకున్న మొదటి మేజర్ అవార్డుని మళ్లీ ఈరోజే అందుకున్నాడు. అవార్డు అందుకున్న అనంతరం మెస్సీ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.
మెస్సీ మాట్లాడుతూ
మెస్సీ మాట్లాడుతూ "వ్యక్తిగత బహుమతి గెలిచి చాలా రోజులైంది. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్‌ను చాలా చెడుగా ప్రారంభించాం. ముఖ్యంగా ఆటలో సరైన అవకాశాలను సృష్టించేందుకు కష్టపడుతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే, కానీ, మేము ఇప్పుడు స్పందించాలి. ఎక్కువ సమయం లేదు, చాలా మెరుగుపరచుకోవాలి. ఈ విషయం మాకు తెలుసు. ఇది జట్టు విషయం. మేము మంచి ప్రదర్శన చేస్తామనే విషయంలో ఎంలాంటి సందేహం లేదు" అని అన్నాడు.
మెస్సీ సారథ్యంలోని
మెస్సీ సారథ్యంలోని బార్సిలోనా గత సీజన్‌లో లాలిగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. బార్సిలోనా క్లబ్‌లో చేరిన తర్వాత మెస్సీకి ఇది 10వ టైటిల్. ఈ స్పానిష్ లీగ్‌లో లియోనల్ మెస్సీ మొత్తం 50 గేముల్లో 51 గోల్స్ చేశాడు. 32 ఏళ్ల మెస్సీ 2019-20 సీజన్ ప్రారంభానికి ముందు కాలిపిక్క గాయంతో బాధపడ్డాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత
అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత మెస్సీ బార్సిలోనా జట్టు తరుపున ఛాంపియన్స్ లీగ్, లాలిగాలలో రెండు ప్రదర్శనలు మాత్రమే చేయడం విశేషం. 1994-95 సీజన్ తర్వాత బార్సిలోనా జట్టు ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఐదు గేములాడి ఏడు పాయింట్లు మాత్రమే దక్కించుకుంది.
58 గేమ్స్ ఆడి 54 గోల్స్
ఈ ఏడాది అన్ని పోటీల్లో కలిపి లియోనల్ మెస్సీ మొత్తం 58 గేమ్స్ ఆడి 54 గోల్స్ సాధించడంతో యూరోపియన్ లీగ్ గోల్డెన్ బూట్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు క్రిస్టియానో రొనాల్డో సైతం 55 గేముల్లో 54 గోల్స్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నప్పటికీ లియోనల్ మెస్సీ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.
బ్రెజిల్ చేతిలో అర్జెంటీనా ఓటమి
అందుకు కారణం మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు కోపా అమెరికా లీగ్ సెమీఫైనల్స్‌లో దాయాదుల పోరులో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది. అయితే, ఈ ఏడాది లివర్‌పూల్ జట్టుని ఛాంపియన్ లీగ్ టైటిల్ విజేతగా నిలబెట్టిన డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్ కాదని మెస్సీకి ఈ అవార్డు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications