'ఉమెన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్'గా లూసీ బ్రాంజ్

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచి ప్రముఖ ప్రసార మాద్యమం బీబీసీ.. ఫుట్‌బాల్ ప్లేయర్లపై సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఆడిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని ఐదుగురి ప్లేయర్లను నామినేట్ చేసింది. దీంతో అభిమానులు, వీక్షకులు అంతా తమ మద్దతుని లూసీ బ్రాంజ్‌కు ఓటింగ్ ద్వారా తెలిపారు. ఇదే అవార్డుకు డెన్మార్క్ పెర్నిల్లె హార్డర్, జర్మనీ డిజైనిఫైర్ కూడా ఎంపికవడంతో తనకు టైటిల్ వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది అని లూసీ బ్రాంజ్ తెలిపారు.
'మీ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారిణి ఎవరు?' అని బి.బి.సి. పెట్టిన అంతర్జాతీయ ఓటింగ్‌లో ఎక్కువ మంది లూసీ బ్రాంజ్ పేరును సూచించారని తెలిసినపుపడు లూసీ నమ్మశక్యం కాని ఆనందంతో కాసేపు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 26 ఏళ్ల లూసీ మొదట్లో 'మాంచెస్టర్ సిటీ' జట్టుకు ఆడేవారు. అక్కడి నుంచి ఫ్రెంచి టీమ్ 'ఒలింపిక్ నియోనైస్' జట్టుకు మారారు. అంతమాత్రాన పూర్తిగా ఆమె ఇంగ్లాండ్‌ను వదిలేసినట్లు కాదు.
ఇంగ్లాండ్ నేషనల్ ఉమెన్స్ ఫుట్‌బాల్ టీమ్ 'లయెనెసెస్'కు కూడా ఆడుతున్నారు. అవార్డు అందుకుంటున్నప్పుడు 'ఇట్స్ రియల్లీ స్పెషల్' అనే పదాలు లూసీ పెదవుల్ని ఒణికించాయి. అంతా చప్పట్లు కొడుతుండడం ఆమెను మరింతగా ఉద్వేగంతో కూడిన తత్తరపాటుకు లోను చేసింది. అవార్డుకు నామినేట్ అవడమే గొప్ప సంగతి అని ఆమె భావిస్తున్న తరుణంలో ఏకంగా అవార్డే అమెను వరించి వచ్చింది.
'నాతో పాటు నామినేట్ అయిన వాళ్లందరూ కూడా అవార్డు అర్హులే' అని లూసీ అన్నారు. ఈ అవార్డు కోసం నామినేట్ అయిపోయిన వాళ్లంతా నిజానికి మంచి ఆటగాళ్లు. చాలా సంవత్సరాల తరబడి ఆడుతూ కనిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications