
హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేనన్న హసెన్ హుట్టల్
దీంతో జప్ హైంకీస్ స్థానంలో మరో హెడ్ కోచ్ కోసం బేయర్న్ మ్యునిచ్ మేనేజ్మెంట్ అన్వేషణ సాగిస్తోంది. బేయర్న్ మ్యునిచ్ హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించలేనని తనకు తాను ఆర్బీ లైప్జిగ్ కోచ్ రాల్ఫ్ హసెన్ హుట్టల్ కూడా తెలిపాడు. హొఫ్ఫన్హైమ్ కోచ్ జులియన్ నాగెల్స్మాన్, టొట్టెన్హామ్ కోచ్ పోచిట్టినో తదితర కోచ్‌ల పేర్లను బేయర్న్ మ్యునిచ్ మేనేజ్మెంట్ చురుగ్గా పరిశీలిస్తోంది.

థామస్ టుచెల్ తోనూ చర్చలు
బేయర్న్ మ్యునిచ్ జట్టు స్పోర్ట్స్ డైరెక్టర్‌గా హసన్ సాలిహమిడ్జిక్ పలు చర్చలు జరుపుతున్నారని, అలాగే థామస్ టుచెల్ తోనూ చర్చించి ఉంటారని రుమ్మెనైగ్గి తెలిపారు. థామస్ టుచెల్ మరో క్లబ్ పని చేసేందుకు ఒప్పందంపై సంతకాలు చేశాడని, అది సంతోషమేనని తెలిపాడు. అయితే జప్ హైంకిస్ స్థానే థామస్ టుచెల్ హెడ్ కోచ్ ప్రథమ ప్రాధాన్యంగా పరిశీలించలేదని చెప్పాడు.

టుచెల్‌తో విభేదాల్లేవన్న కార్ల్ హైంజ్ రుమ్మెనిగ్గే
‘లేదు. ఇటువంటి నిర్ణయాలన్నీ మేం కమిటీలో తీసుకుంటాం' బేయర్స్ మ్యునిచ్ సీఈఓ కార్ల్ హైంజ్ రుమ్మెనిగ్గే తెలిపాడు. స్పోర్ట్స్ డైరెక్టర్‌గా హసన్ సాలిహమిడ్జిక్ పలు ప్రతిపాదనలు చేస్తారని, బోర్డు సమావేశంలో వాటిని చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం' అని అన్నాడు. థామస్ టుచెల్ చాలా మంచి కోచ్ అని, ఆయన టైం డార్ట్‌మండ్‌కు కేటాయించారని తమకు తెలుసునని, ఇంతకంటే ఎక్కువగా చెప్పేదేమీ లేదని చెప్పాడు. థామస్ టుచెల్, తనకు మధ్య విభేదాలేమీ లేవని కార్ల్ హైంజ్ రుమ్మెనిగ్గే తెలిపాడు.

థామస్ టుచెల్ పైనే షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫోకస్
పారిస్ సెయింట్ - జర్మైన్ జట్టు కోచ్ యునాయి ఎమిరే స్థానంలో పారిస్ సెయింట్ - జర్మైన్ (పీఎస్జీ) కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించాడు. రెండేళ్లపాటు కాంట్రాక్ట్‌పై సంతకం చేయనున్నాడని ఈఎస్పీఎన్ వార్తాసంస్థ ఒక వార్తాకథనం ప్రచురించింది. యునాయి ఎమిరే స్థానంలో పీఎస్జీ యజమాని షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ముందుగా థామస్ టుచెల్‌నే సరైన వ్యక్తి అని, ఫుట్ బ్యాల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆయన అటాకింగ్ వ్యూహం ఆయన తెలివి తేటలు తమ జట్టుకు చాలా ఉపయోగ పడతాయని తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications














