Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్జనలో లియోనెల్‌ మెస్సీ టాప్‌.. రెండో స్థానంలో క్రిస్టియానో రొనాల్డో!!

Barcelona superstar Lionel Messi tops Forbes 2020 football rich list

లండన్: అర్జెంటీనా అగ్రశ్రేణి ఆటగాడు, బార్సిలోనా సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ సంపాదనలో టాప్‌లో నిలిచాడు. ఈ ఏడాది అత్యధికంగా ఆర్జించిన ఫుట్‌బాల్‌ ప్లేయర్ల జాబితాను ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేయగా.. 126 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.927 కోట్లు) సంపాదనతో మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు. 12 కోట్ల 60 లక్షల డాలర్లలో 9 కోట్ల 20 లక్షల డాలర్లు వేతనం ద్వారా రాగా.. మిగతా 3 కోట్ల 40 లక్షల డాలర్లు వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదించాడు.

ఈ ఏడాది సంపాదనతో బిలియన్‌ డాలర్ల (వంద కోట్ల డాలర్లు) క్లబ్‌లో లియోనెల్‌ మెస్సీ అడుగుపెట్టాడు. పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తర్వాత కెరీర్‌లో బిలియన్‌ డాలర్ల మార్కు చేసిన రెండో ఫుట్‌బాలర్‌గానూ మెస్సీ రికార్డుల్లోక్కాడు. ఇక సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాలర్‌గా పేరున్న‌ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్‌ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు.. ఎండార్స్‌మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందాడు.

లియోనెల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తర్వాత అత్యధికంగా ఆర్జించిన ఫుట్‌బాల్‌ ప్లేయర్ల జాబితాలో బ్రెజిల్‌ ఆటగాడు నేమార్‌ జూనియర్‌ ఉన్నాడు. రూ.706 కోట్లతో నేమార్‌ మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్‌-పారిస్నేమార్‌ జూనియర్‌ సెయింట్‌ జెర్మయిన్‌), సలా (ఈజిప్ట్‌-లివర్‌పూల్‌) ఉన్నారు.

ఆర్జనలో లయెనల్‌ మెస్సీ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నా.. 15 ఏళ్ల నుంచి అంతర్జాతీయస్థాయిలో తన జట్టుకు ఎలాంటి గొప్ప టైటిల్స్‌ అందించలేకపోయాడు. స్పెయిన్‌కు చెందిన విఖ్యాత క్లబ్‌ బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ.. ఈ ఏడాది బార్సిలోనా జట్టు ఒక్క టైటిల్‌ కూడా సాధించకపోవడంతో క్లబ్‌ను వీడాలనుకుంటున్నానని తెలిపాడు. కానీ ఒప్పందం ప్రకారం మెస్సీ వచ్చే ఏడాది వరకు బార్సిలోనా జట్టుతోనే ఉండాలి. ఈ నేపథ్యంలో మెస్సీ తన ఆలోచనను విరమించుకొని మరో ఏడాది పాటు బార్సిలోనాతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు.

Story first published: Wednesday, September 16, 2020, 7:40 [IST]
Other articles published on Sep 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+