For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొనాల్డో కంటే మెస్సీ ఆదాయం టాప్, ఆటతీరులో కూడా..

Barcelona Star Lionel Messi Overtakes Cristiano Ronaldo as Highest Earner

హైదరాబాద్: ఎట్టకేలకు బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ ఎట్టకేలకు మరో అడుగు ముందుకు వేశారు. వేతనాలను పొందడంలో ఆయన వ్యక్తిగత ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను దాటేశారని ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మ్యాగజైన్ ఒక వార్తాకథనం ప్రచురించింది. బార్సిలోనా ఎఫ్సీ ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ ప్రస్తుత సీజన్‌లో వేతనం, బోనస్, వాణిజ్య రెవెన్యూ కలిపి 126 మిలియన్ల యూరోలు (154 మిలియన్ల అమెరికా డాలర్లు) పొందుతుంటే, రియల్ మాడ్రిడ్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వేతనం తదితర ఆదాయం మొత్తం 94 మిలియన్ల యూరోలు మాత్రమే.

గత సీజన్‌లో రొనాల్డో వేతనం 87.5 మిలియన్ల యూరోలు

గత సీజన్‌లో రొనాల్డో వేతనం 87.5 మిలియన్ల యూరోలు

గత సీజన్‌లో క్రిస్టియానో రొనాల్డో వేతన తదితర ఆదాయం కలుపుకుని 87.5 మిలియన్ల యూరోలైతే లియానెల్ మెస్సీ వేతనం తదితర ఆదాయం 76.5 మిలియన్ల యూరోలు మాత్రమే. లా లీగా, చాంపియన్స్ లీగ్, స్పానిష్ కప్, సూపర్ కప్‌తోపాటు అర్జెంటీనా తరపున నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొన్నందుకు పిచ్‌పై నిలుచున్న ప్రతి నిమిషానికి లియానెల్ మెస్సీ 25 వేల యూరోల వేతనం పొందుతున్నాడు. ఇంకా ప్రస్తుత సీజన్‌లో బార్సిలోనా తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది.

 మెస్సీ, రొనాల్డో మధ్యే బాలోన్స్ డీఓర్ అవార్డు పంపిణీ

మెస్సీ, రొనాల్డో మధ్యే బాలోన్స్ డీఓర్ అవార్డు పంపిణీ

గత 10 సంవత్సరాలుగా బాలోన్స్ డీఓర్ అవార్డు లియానెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మధ్య తచ్చాడిందంటే అతిశయోక్తి కాదు. తదుపరి దశలో పారిస్ సెయింట్ జెర్మైన్ ఆటగాడు బ్రెజిలియన్ స్టార్ నేయ్మార్ 81.5 మిలియన్ల యూరోల వేతనం పొందుతున్నాడని మంగళవారం ఫ్రాన్స్ ఫుట్ బాల్ మ్యాగజైన్ కథనం తెలిపింది.

 జట్టు సభ్యుల వేతనంతోపాటు ఆదాయంలో తేడాలు

జట్టు సభ్యుల వేతనంతోపాటు ఆదాయంలో తేడాలు

జట్టు సభ్యుల వేతనాల మధ్య చాలా తేడా కూడా ఉంది. రియల్ మాడ్రిడ్ జట్టు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వేతనం 94 మిలియన్ల యూరోలు, ఆయన సహచరుడు గారెథ్ బాలే వేతనం 44 మిలియన్ల యూరోల వేతనం మాత్రమే లభిస్తున్నది. బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీకి 126 మిలియన్ల యూరోలు వేతనం లభిస్తూ ఉంటే, ఆయన సహచరుడు డిఫెండర్ గెరార్డ్ పీక్యూ వేతనం 29 మిలియన్ల యూరోలు మాత్రమే.

వేతనంతోపాటు ఆదాయంలో మాంఛెస్టర్ సిటీ మేనేజర్ జోస్ మౌరిన్హో టాప్

వేతనంతోపాటు ఆదాయంలో మాంఛెస్టర్ సిటీ మేనేజర్ జోస్ మౌరిన్హో టాప్

వివిధ జట్ల కోచ్‌లు, మేనేజర్ల వేతనాల విషయానికి వస్తే మాంఛెస్టర్ యునైటెడ్ కోచ్ కం మేనేజర్ జోస్ మౌరిన్హో అత్యధికంగా 26 మిలియన్ల యూరోల వేతనం పొందుతున్నాడు. తర్వాత స్థానంలో చైనా జట్టు కోచ్ మార్సెల్లో లిప్పీ 23 మిలియన్ల యూరోల వేతనం అందుకుంటున్నాడు. తర్వాతీ స్థానాలో అట్లెంటికో మాడ్రిడ్ కోచ్ డియాగో సిమ్మోన్, రెండు చాంపియన్ లీగ్ టైటిళ్లు గెలుచుకున్న రియల్ మాడ్రిడ్ జట్టు కోచ్ జినెడిన్ జిడానె, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకున్న మాంచెస్టర్ సిటీ కోచ్ కం మేనేజర్ పెప్ గౌర్డియోలా

2017 - 18లో అత్యధిక వేతనాలు పొందిన ప్లేయర్లు వీరే

2017 - 18లో అత్యధిక వేతనాలు పొందిన ప్లేయర్లు వీరే

ప్రస్తుత సీజన్‌లో బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ 126 మిలియన్ల యూరోల వేతనం తదితరాలు పొందుతున్నారు. రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 94 మిలియన్ల యూరోల వేతనం అందుకుంటున్నాడు. మూడో స్థానంలో పారిస్ సెయింట్ జెర్మైన్ స్టార్ ఆటగాడు నేయ్మార్ 81.5 మిలియన్ల యూరోల వేతనం పొందుతున్నాడు. రియల్ మాడ్రిడ్ ఆటగాడు గారెథ్ బాలే 44 మిలియన్ల యూరోలు, బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పీక్యూ 29 మిలియన్ల యూరోల వేతనం పొందుతున్నాడు.

జోస్ మౌరిన్హో తర్వాతీ స్థానంలో మార్సెల్లి లిప్సీ

జోస్ మౌరిన్హో తర్వాతీ స్థానంలో మార్సెల్లి లిప్సీ

స్థూలంగా వేతనాలు, బోసన్, వాణిజ్య ప్రకటనల రూపంలో అత్యధిక ఆదాయం పొందుతున్న వారిలో మాంఛెస్టర్ యునైటెడ్ కోచ్ కం మేనేజర్ జోస్ మౌరిన్హో ఉన్నారు. ఆయన ఆదాయం 26 మిలియన్ల యూరోలు. చైనా ఫుట్ బాల్ అకాడమీ కోచ్ మార్సెల్లి లిప్పీ ఆదాయం 23 మిలియన్ల యూరోలుగా ఉంది. అట్లెంటికో మాడ్రిడ్ కోచ్ కం మేనేజర్ డియాగో సిమోన్ ఆదాయం 22 మిలియన్ల యూరోలు, రియల్ మాడ్రిడ్ మేనేజర్ కం కోచ్ వేతనం తదితర రూపాల్లో పొందుతున్న ఆదాయం 21 మిలియన్ల యూరోలు, మాంఛెస్టర్ సిటీ కోచ్ పెప్ గౌర్డెలియా వేతనం తదితర రూపాల్లోని ఆదాయం 20 మిలియన్ల యూరోలుగా ఉన్నది.

Story first published: Wednesday, April 25, 2018, 15:34 [IST]
Other articles published on Apr 25, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+