Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెస్ట్ ఆఫరిస్తాం: మెస్సీకి బార్సిలోనా ప్రతిపాదన

బార్సిలోనా: స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగ' జెయింట్స్ జట్టు ఎఫ్ సి బార్సిలోనా క్లబ్ స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీ కాంట్రాక్ట్ పునరుద్ధరణపైనే అందరిదృష్టి ఉంది. 2018 జూన్‌తో క్లబ్ తో ఆయన చేసుకున్న కాంట్రాక్ట్ ఒప్పందం ముగిసిపోనున్నది. మిగతా ప్లేయర్లు అంతా తమ కాంట్రాక్టులను పునరుద్ధరించుకున్నారు.

చివరి క్షణం వరకూ వేచి చూసే ధోరణిలో మెస్సీ

చివరి క్షణం వరకూ వేచి చూసే ధోరణిలో మెస్సీ

కానీ మెస్సీ మాత్రం చివరి క్షణం వరకూ వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎఫ్ సి బార్సిలోనా క్లబ్ అధ్యక్షుడు జొసెప్ మారియా బార్టోమౌ మాట్లాడుతూ లియానెల్ మెస్సీ కాంట్రాక్ట్ పునరుద్ధరణ కోసం ఆయనకు భారీ మొత్తంలో ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమని సంకేతాలిచ్చాడు.

కెరీర్ ముగిసే వరకూ బార్సిలోనా తరఫునే

కెరీర్ ముగిసే వరకూ బార్సిలోనా తరఫునే

ఈ అర్జెంటీనా ప్లేయర్ తన కెరీర్ ముగిసే వరకూ బార్సిలోనా తరఫునే ఆడేలా చూసుకోవాలని క్లబ్ యాజమాన్యం కోరికగా కనిపిస్తున్నది. తమ జట్టుతో అనుసంధానమై ఉండేందుకు ప్రపంచంలోకెల్లా లియానెల్ మెస్సీకి అత్యంత ఉత్తమమైన ఆర్థిక ప్యాకేజీతో కూడిన కాంట్రాక్టును ప్రతిపాదిస్తామన్నాడు.

సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు లియానెల్ మెస్సీ

సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు లియానెల్ మెస్సీ

సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు లియానెల్ మెస్సీ అనడంలో ఎటువంటి సందేహం లేదని జొసెఫ్ పునరుద్ఘాటించాడు. ఈ మేరకు మెస్సీ కాంట్రాక్టు పునరుద్ధరణ కోసం సంప్రదింపులు ప్రారంభిస్తామన్నారు. తమ క్లబ్ లో ఉన్నప్పుడు ఆయన హ్యాపీగా ఉంటారని భావిస్తున్నామన్నారు.

పన్ను ఎగవేతకు పాల్పడిన మెస్సీ తండ్రి

పన్ను ఎగవేతకు పాల్పడిన మెస్సీ తండ్రి

మెస్సీ తండ్రి అర్జెంటీనా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జైలుశిక్షను ఎదుర్కొంటున్నాడు. లా లీగలో దాయాది జట్టు రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడి కెరీర్‌లో కొనసాగుతున్న మెస్సీ మెరుగైన ఆఫర్ కోసం వేచి చూస్తున్నారా? అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+