ఫోటోలు: బ్రెజిల్ క్లబ్‌కు బార్సిలోనా ఫ్రెండ్లీ ఇన్విటేషన్
రియో డీ జనెరియో: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ లా లీగ జెయింట్స్ 'బార్సిలోనా ఎఫ్ సి' .. బ్రెజిలియన్ ఫుట్ బాల్ టీం చాపెకొయెన్స్ జట్టును ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ఆహ్వానించింది. వచ్చే ఏడాది ఆగస్టులో ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొనాల్సిందిగా బ్రెజిల్ జట్టుకు బార్సిలోనా ఎఫ్ సి జట్టు ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇటీవల కొలంబియా విమాన ప్రమాదంలో బ్రెజిలియన్ ఫుట్ బాల్ జట్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో బార్సిలోనా ఎఫ్ సి జట్టు ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకున్నది. క్యాంప్ నౌలో జువాన్ గాంపర్ ట్రోఫీలో తలపడేందుకు సిద్ధం కావాలని బార్సిలోనా కోరింది.
'విమాన ప్రమాదంలో మరణించిన ఫుట్ బాల్ క్రీడాకారుల కుటుంబాలను ఆదుకోవడంతోపాటు విమాన ప్రమాదంలో మ్రుతి చెందిన వారికి నివాళులర్పించాలని ఎఫ్ సి బార్సిలోనా భావిస్తున్నది. అందుకోసం వచ్చే ఏడాది జరిగే జువాన్ గ్యాంపర్ ట్రోఫీలో వరల్డ్ ఫుట్‌బాల్ తరఫున మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు 2017 జువాన్ గ్యాంపర్ ట్రోఫీలో చర్యలు చేపట్టాలని భావిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది.

బ్రెజిల్ క్లబ్‌కు బార్సిలోనా ఫ్రెండ్లీ ఇన్విటేషన్
చాఫెకొయెన్సెకు పంపిన ఆహ్వానం వల్ల సంస్థాగతంగా పరస్పర సహకారంతోపాటు క్లబ్ తిరిగి కోలుకుని పునర్యవస్థీకరణ ద్వారా టోర్నీల్లో అడుగు పెట్టేందుకు వీలవుతుందని తెలిపింది. లా లీగ లీగ్ ప్రారంభానికి వారం ముందు క్యాంప్ నౌలో ప్రతియేటా జువాన్ గ్యాంపర్ టోర్నీ జరుగుతుంది.

చాపెకొయెన్సెకు టైటిల్
గత నెల 28న మెడెల్లిన్ కు సమీపాన జరిగిన విమాన ప్రమాదంలో క్లబ్ డైరెక్టర్లు, 20 మంది జర్నలిస్టులు, 19 మంది చాపెకొయెన్సే ఆటగాళ్లు మరణించిన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీ నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బ్రెజిలియన్ ఫస్ట్ డివిజన్ క్లబ్.. అట్లెటికో నేషనల్ డి మెడిల్లిన్ జట్టుతో కొపా సుదామెరికానా ఫైనల్స్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అట్లెటికో నేషనల్ రిక్వెస్ట్ మేరకు చాపెకొయెన్సెకు ఈ వారం టైటిల్ ప్రదానం చేస్తారు.

రియల్ మాడ్రిడ్‌తో డార్ట్ మండ్ డ్రా
చాంపియన్స్ లీగ్‌లో బొరుస్సియా డార్ట్‌మండ్ కొత్త రికార్డు నెలకొల్పింది. డిఫెండింగ్ చాంపియన్ ప్లస్ స్పానిష్ లీగ్ జెయింట్ రియల్ మాడ్రిడ్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో 2 - 2 స్కోర్‌తో డ్రా గా ముగించింది. ఇదే లీగ్‌లో ఎఫ్ సి పోర్టో, సెవిల్లా టాప్ 16 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రియల్ మాడ్రిడ్‌తో పోటాపోటీగా జరిగిన మ్యాచ్‌లో గ్రూప్ ఎఫ్ లో డార్ట్ మండ్ టాప్ స్థానానికి చేరుకుని క్వార్టర్ ఫైనల్స్‌లో అవకాశాలను మెరుగు పరుచుకున్నది.

స్కోరు సమం
మ్యాచ్ ముగింపునకు రెండు నిమిషాల ముందు మార్కో రెయూస్ స్కోర్ సాధించడంతో స్కోర్ సమమైంది. చాంపియన్స్ లీగ్ టైటిల్ ను రెండుసార్లు గెలుచుకున్న పొర్టో టీం.. ఇంగ్లిష్ చాంపియన్స్ లైసెస్టర్ సిటీపై 5 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. దీంతో పోర్చుగీస్ జట్టు 11 పాయింట్లతో టాప్ స్థానానికి చేరుకుంటే డెన్మార్క్ ఎఫ్ సి కొపెన్ హగ్ మూడో స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications