Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెస్సీ, రొనాల్డోలకు మోడ్రిచ్ షాక్: పదేళ్ల తర్వాత ఇలా జరగడం తొలిసారి

Ballon dOr: Luka Modric ends dominance of Lionel Messi and Cristiano Ronaldo

హైదరాబాద్: సాకర్ ప్రపంచంలో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డోల ఆధిపత్యానికి తెరపడిందా? అంటే అవుననే అంటున్నారు పుట్‌బాల్ విశ్లేషకులు. అదేంటి? మెస్సీ, రొనాల్డోలు ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు కాదా? అనే ప్రశ్న సాకర్ అభిమానుల్లో ఉదయిస్తుంది.

అయితే, గత కొన్నేళ్లుగా సాకర్ ప్రపంచంలో మెస్సీ, రొనాల్డో రారాజులుగా వెలుగొందుతున్నారు. క్లబ్ సాకర్‌లో రికార్డ్ స్థాయిలో గోల్స్ చేయడంతో పాటు అనేక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ అరుదైన రికార్డులను నమోదు చేశారు. 2008 నుంచి 2017 వరకూ గత పదేళ్లుగా ఈ ఇద్దరే ప్రతిష్టాత్మక బాలోన్ డీ ఓర్ అవార్డుని గెలుచుకుంటున్నారు.

2018 సంవత్సరానికి అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌ అవార్డ్ నెగ్గడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. అయితే, మొట్టమొదటిసారి క్రొయేషియా స్టార్ లూకా మోడ్రిచ్ వీరిద్దరికి షాకిచ్చాడు. 2018 సంవత్సరానికి అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌‌కు ఇచ్చే బాలోన్ డీ ఓర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా అత్యుత్తమ ఆటగాడిని ఎంపిక చేశారు. రొనాల్డో, మెస్సీల కంటే మోడ్రిచ్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓటింగ్‌లో మోడ్రిచ్‌కు మొత్తం 753 పాయింట్స్ రాగా రొనాల్డోకు 478, మెస్సీకి 280 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. పదేళ్ల తర్వాత మెస్సీ, రొనాల్డో కాకుండా మరో ఆటగాడు బాలోన్ డీ ఓర్ అవార్డు అందుకోవడం విశేషం.

* 2008 - క్రిస్టియానొ రొనాల్డో
* 2009 - లియోనల్ మెస్సీ
* 2010- లియోనల్ మెస్సీ
* 2011- లియోనల్ మెస్సీ
* 2012- లియోనల్ మెస్సీ
* 2013- క్రిస్టియానొ రొనాల్డో
* 2014 - క్రిస్టియానొ రొనాల్డో
* 2015- లియోనల్ మెస్సీ
* 2016- క్రిస్టియానొ రొనాల్డో
* 2017 - క్రిస్టియానొ రొనాల్డో
* 2018 - లుకా మోడ్రిచ్

Story first published: Tuesday, December 4, 2018, 19:20 [IST]
Other articles published on Dec 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+