Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొహున్ బగన్ తొలి మ్యాచ్‌కు రవీంద్ర సారోబార్ అనుమానమే?

కోల్‌కతా: ఐ-లీగ్ ప్రారంభానికి మరో 12 రోజుల గడువు మాత్రమే ఉన్నది. కానీ తొలి మ్యాచ్ ఆడేందుకు కోల్ కతా జెయింట్స్ టీం మొహున్ బగన్ కు నూతన వేదిక ఇంకా అందుబాటులోకి రాలేదు. మాజీ చాంపియన్స్ అయిన మొహున్ బగన్ తొలుత చర్చిల్ బ్రదర్స్‌తో తలపడుతుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరిగే యు - 17 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ ల కోసం స్టాల్ లేక్ స్టేడియంను సిద్ధంచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మొహున్ బగన్, ఈస్ట్ బెంగాల్ జట్లు ఈ దఫా కొత్త స్టేడియంలను వెతుక్కోవాల్సి వచ్చింది. రవీంద్ర సారోబార్ స్టేడియంను మొహున్ బగన్, బరాసత్ స్టేడియంను ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఎంపికచేశారు. కానీ ఈ ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ చాంపియన్లుగా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) జట్టు మేనేజ్మెంట్ ఇప్పటివరకు రవీంద్ర సారోబార్ స్టేడియంను దాని నిర్వాహకులకు అప్పగించలేదు.

Bagan's new I-League venue in race against time before hosting first game

ఈ నెల 10న ఐఎస్ఎల్ తొలి సెమీ ఫైనల్స్ నిర్వహించిన తర్వాత ఇంతవరకు స్టేడియంను నీటితో నింపలేదని సెక్యూరిటీ గార్డులు చెప్తున్నారు. ప్రస్తుతం విజయోత్సాహంలో మునిగిపోయి ఉన్న అట్లెటికో డి కోల్ కతా జట్టు స్టేడియం అప్పగింత సంగతే మరిచిపోయిందని విమర్శలు ఉన్నాయి. దీంతో వచ్చేనెల ఏడో తేదీన తొలి మ్యాచ్ నిర్వహణ కష్ట సాధ్యమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

'ఇది పండుగల సీజన్. తర్వాత నూతన సంవత్సర వేడుకలు వస్తాయి. మేమంతా ఆ బిజీలో ఉంటాం. కనుక తొలి మ్యాచ్ కోసం విధుల్లోకి వస్తాం. పని వేగవంతం చేయాల్సి ఉంది. దూరం నుంచే చూసే వారికి కనిపించేలా వేదికను సిద్ధం చేయాలి' పోలీసు అధికారి తెలిపారు. కానీ మొహున్ బగన్ అధికారులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు. వచ్చేనెల ఏడో తేదీ సాయంత్రం ఏడుగంటల కల్లా స్టేడియం సిద్ధమవుతుందని దీమాగా ఉన్నారు.

మాంఛెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ గుండోగాన్ మోకాలికి సర్జరీ
మాంఛెస్టర్: మాంఛెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ ఐల్కాయి గుండోగాన్ కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ నెల 15న ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్)లో వాట్ఫోర్డ్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో 2 - 0 స్కోర్ తో విజయం సాధించినా గుండోగాన్ కుడి మోకాలికి గాయమైంది. వైద్యులు దానికి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో తన కుడి మోకాలికి శస్త్ర చికిత్స సాఫీగా సాగిపోయిందని ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.

'హీ గైస్.. నేను బాగానే ఉన్నాను. నాకు సర్జరీ చాలా బాగా జరిగింది. పూర్తిగా కోలుకున్న తర్వాత సమర్థవంతంగా ముందుకు దూసుకొస్తా' అని పోస్ట్ చేశాడు. మోకాలికి శస్త్ర చికిత్స కారణంగా ఈ సీజన్ అంతా విశ్రాంతికే పరిమితం కానున్నాడు. బొరుస్సియా డార్ట్ మండ్ నుంచి మాంఛెస్టర్ సిటీ జట్టులో చేరిన గుండోగాన్ వచ్చే ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు పిచ్ కు దూరంగా ఉండాల్సిందే.

ఇంతకుముందు ఇదే మోకాలికి జర్మనీలో గాయమైంది. 'మాంఛెస్టర్ సిటీలోని ప్రతి ఒక్కరూ ఇల్కాయి త్వరితగతిన కోలుకుని సాధ్యమైనంత త్వరగా తిరిగి జట్టులో చేరాలని ఆకాంక్షిస్తున్నారు' అని మాంఛెస్టర్ సిటీ క్లబ్ వెబ్ సైట్ పేర్కొంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+