మ్యాచ్ ఓడిపోయారనే కోపంలో బస్సు తగలబెట్టేశారు..

Posted By:
Attack on Man City coach before Liverpool game leaves Pep Guardiola bemused

హైదరాబాద్: లివర్‌పూల్ జట్టుతో తలపడిన మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 3-0 పాయింట్లతో గెలిచింది. మంగళవారంతో గేమ్ ముగిసిపోయింది కానీ, ఆటలోని ఆవేశం ఇంకా చల్లారలేదు. ఆట ముగించుకుని బయల్దేరిన మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఆటగాళ్ల బస్సు తగలబెట్టేంత పనిచేసింది.

ఈ విషయంపై స్పందించిన మాంచెస్టర్ జట్టు కోచ్ పెప్ గార్డియోలా మాట్లాడుతూ.. లివర్‌పూల్ జట్టు వర్గం ఇంతటి పని చేస్తుందనుకోలేదు. ఇది చాలా హేయమైన చర్య. ఇక ఇప్పటితోనైన ఆపి మరోసారి జరగకుండా చూసుకుంటారని' ఆశిస్తున్నానన్నాడు.

అసలేం జరిగింది:

అసలేం జరిగింది:

మ్యాచ్ ముగించుకుని కోచ్ పెప్ గార్డియోలా మైదానం నుంచి బయటకు వచ్చే దారిలో ఏదో కట్టడం నిర్మాణం జరుగుతుండటంతో దారి మళ్లించాడు. వేరే మార్గం గుండా బయటికి వస్తున్న జనాన్ని అదుపు చేయడానికి అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని స్నేహపూర్వకంగానే పక్కకు తప్పించమని చెప్పాడు. అప్పటికే లివర్‌పూల్ జట్టు మ్యాచ్ ఓడిపోయిందని ఆవేశంలో రగిలిపోతున్న జనం బస్సుపై దాడి చేయడం మొదలుపెట్టారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు అల్లర్లను అదుపుచేయడంతో కోచ్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇద్దరు పోలీసులు గాయాలపాలైయ్యారు.

ఆటగాళ్లకు గాయాలేం కాలేదు

ఆటగాళ్లకు గాయాలేం కాలేదు

ఆటగాళ్లకు గాయాలేం కాలేదు. అదృష్టవశాత్తు క్రీడాకారులేం జరగలేదు. ఇద్దరు పోలీసులు మాత్రమే గాయాలపాలైయ్యారు. కేసు విచారణలో ఉంది. పూర్తి వివరాల తెలిసిన తర్వాత శిక్ష గురించి చర్చిస్తాం. ఒకవేళ లివర్ పూల్ జట్టు గనుక ఇది చేసుంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. అని పెప్ గార్డియోలా అన్నాడు.

క్షమాపణ చెప్పేదే లేదు:

క్షమాపణ చెప్పేదే లేదు:

క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా లేము. ప్రమాదం జరిగిన స్థలం మాకు సంబంధించింది కాబట్టి మేము చింతిస్తున్నాం. కానీ, మా జట్టు నుంచి కానీ, మాకు సంబంధించిన వాళ్లెవరూ ఈ పనికి పూనుకోలేదు. అని లివర్‌పూల్ జట్టు అధికారి ఒకరు పేర్కొన్నారు.

రొనాల్డో బై సైకిల్ కిక్:

రొనాల్డో బై సైకిల్ కిక్:

ఇదే లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు క్రిస్టియన్ రొనాల్డో బై సైకిల్ కిక్ ఇచ్చి మ్యాచ్ విన్నింగ్ అద్భుతంగా మలిచాడు. అతను కూడా ఊహించలేని గోల్ ను చేయడంతో జట్టుకు సంబంధం లేకుండా అతనిపై ప్రశంసలు కురిశాయి. ఇది అతని కెరీర్ లోనే అత్యుత్తమమైన గోల్.

Story first published: Thursday, April 5, 2018, 18:32 [IST]
Other articles published on Apr 5, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి