హైదరాబాద్: మాంచెస్టర్ యునైటెడ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు మిడ్ఫిల్డర్ అండర్ హెరెరా తర్వాతి సీజన్లో మరో జట్టు తరుపున ఆడడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది నుంచి జరిగే లీగ్‌ల్లో అతను ఆట్లెటికో మాడ్రిడ్ జట్టు తరుపున ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఇదే విషయాన్ని మీడియా హెరెరా ముందు ప్రస్తావించగా అతను ఒప్పుకున్నాడు. హెరెరా గత ఏడాది యునైటెడ్ జట్టు ఆడిన లీగ్ కప్, యూరోపా లీగ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మాంచెస్టర్ జట్టు మ్యాచ్ ఆడినంత సేపు హెరెరా అద్భుత ప్రదర్శన చేశాడు.
అలాంటిది ఇప్పుడు అతను జట్టులో లేకపోవడం వారికి పెద్ద లోటనే చెప్పాలి. హెరెరా 2016 సంవత్సరానికి గానూ యూనైటెడ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. వచ్చే సీజన్లో అతను ఒక వారానికి గానూ లక్ష ఇరవై వేల పౌండ్స్ తీసుకొనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఆట్లెటికో మాడ్రిడ్ జట్టు మేనెజర్ డియాగో సిమన్స్ జట్టు మార్పులపై సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సీజన్ అనంతరం క్లబ్ కెప్టెన్( మిడ్ ఫీల్డర్) గాబీ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు వివరించాడు. గాబీ గత సీజన్లోనే బార్సిలోనా జట్టులో చేరాలనుకున్న సంగతి తెలిసిందే.
గాబీ స్థానంలో యునైటెడ్ మిడ్‌ఫీల్డర్ హెరెరా జట్టుతో కలవనున్నాడని ఆయన తెలిపారు. జట్టు మారే ఒప్పందం ఇప్పటికే జరిగిందని, అభిమానులకు నచ్చిన అండర్ హెరెరా మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో లేకపోవడం ఆ జట్టుకు తీరని లోటే.