Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: టైటిల్ పోరుకు కోల్‌కతా రె‘ఢీ’

ముంబై: అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె), ముంబై సిటీ మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్స్ మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది. ఈ నెల 10న జరిగిన తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో ముంబై సిటీపై 3 - 2 స్కోర్ తేడాతో విజయం సాధించడంతో ఎటికె నేరుగా టైటిల్ పోరుకు సిద్ధమైంది.

ఇక ఢిల్లీ డేర్‌డేవిల్స్, కేరళ బ్లాక్‌బస్టర్స్ మధ్య విజేతతో ఈ నెల 18న పొస్టిగ సేన తలపడుతుంది. అయితే 43వ నిమిషం నుంచి కోల్‌కతా 10 మంది కుర్రాళ్లతో ఆడాల్సిన పరిస్థితి వచ్చినా డిఫెన్సివ్ ధోరణితో ముందుకు సాగింది. అయితే కోల్‌కతా ప్లేయర్లు పంతానికి పోయి లేని సమస్యలు కొని తెచ్చుకున్నారు.

హోరాహోరీ మ్యాచ్‌లో గోల్స్ లేకుండా డ్రా

హోరాహోరీ మ్యాచ్‌లో గోల్స్ లేకుండా డ్రా

ఇరు జట్లు పరస్పరం హోరాహోరీ తలపడటంతో మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది. అయితే జువాన్ కార్లోస్ బెలెంకోసో హెడ్‌తో ముంబై ప్లేయర్‌ను ఢీ కొట్టడంతో రిఫరీ రెడ్ కార్డు చూపాడు. ఫలితంగా 18న జరిగే కీలక టైటిల్ పోరుకు బెలెంకోసో దూరం కానున్నాడు. ఇక ముంబై సిటీ కనీసం ఒక్క గోల్ చేసినా రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారేది.

రెడ్ కార్డును ఎదుర్కొన్న ముంబై సారధి

రెడ్ కార్డును ఎదుర్కొన్న ముంబై సారధి

తద్వారా ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలు ఉండేవి. కానీ ఫస్టాఫ్‌లో బంతిపై ఆధిపత్యం కొనసాగించినా గోల్ సాధించలేకపోయింది. సెకండాఫ్‌లో కోల్‌కతా జట్టు 10 మందితో బరిలోకి దిగినా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. తొలి సెమీ ఫైనల్స్‌లో రెండుసార్లు ఫౌల్ చేయడంతో రిఫరీ నుంచి రెడ్ కార్డును ఎదుర్కొన్న ముంబై సారధి డియాగో ఫోర్లాన్ మంగళవారం మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.

సునీల్ ఛెత్రి జట్టుకు సారథ్యం

సునీల్ ఛెత్రి జట్టుకు సారథ్యం

దీంతో ఇండియన్ స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి జట్టుకు సారథ్యం వహించాడు. గ్రూప్ దశలో అద్భుతమైన హ్యాట్రిక్ గోల్స్ సాధించి ఎటికెపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఫోర్లాన్ లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ముంబై జట్టు ఫస్టాఫ్ సెషన్‌లో గోల్స్ సాధించేందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగంచేసుకోలేకపోయింది.

గోల్ సాధించడంలో ముంబై విఫలం

గోల్ సాధించడంలో ముంబై విఫలం

మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాల ముందు కూడా చివరిగా అవకాశం వచ్చినా ముంబై గోల్ సాధించడంలో విఫలమైంది. ముంబై సారథిగా సునీల్ ఛెత్రి నేరుగా గోల్ పోస్ట్ కు పంపిన బంతిని ఎటికె గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ విజయవంతంగా సేవ్ చేసి తన జట్టును కాపాడుకోగలిగాడు. పాస్ ప్రొవైడర్ రోమినియన్ ఆటగాడు లుసియాన్ గోవాన్ తెలివిగా మధ్య నుంచి పంపిన బంతిని సునీల్ ఛెత్రి గోల్ పోస్ట్ కు పంపినా ప్రయోజనం లేకపోయింది.

అవకాశాల కోసం ఆసక్తిగా

అవకాశాల కోసం ఆసక్తిగా

43వ నిమిషంలో ఎటికె మిడ్ ఫీల్డర్ రాబర్ట్ లాల్‌థ్లామౌనా రెండు సార్లు ఫౌల్ చేయడంతో రిఫరీ రెడ్ కార్డు చూపిన దరిమిలా మాజీ చాంపియన్లు మిగతా మ్యాచ్ అంతా 10 మందితోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొన్నది. అట్లెటికో డి కోల్ కతా జట్టు ప్లేయర్లు సైతం ప్రత్యర్థి ప్రాంతంలో అవకాశాల కోసం ఆసక్తిగా ప్రయత్నించారు.

34వ, 43వ నిమిషాల్లో ఫౌల్స్

34వ, 43వ నిమిషాల్లో ఫౌల్స్

తొలిసారి జావియర్ లారా పంపిన బంతిని అబినాష్ రుడియాస్ ఎడమవైపు నుంచి స్క్వేర్‌లో ఉన్న సబ్‌స్ట్యూట్ ప్లేయర్ లాల్రిండికా రాల్టే కు పంపినా అది బౌన్స్ అయింది. దానికి ముందు ఎటికె ప్లేయర్లు బోర్జా ఫెర్నాండెజ్, గెర్సన్ వైరీరా ప్రారంభంలోనే నాలుగు ఎల్లోకార్డులను ఎదుర్కొన్నారు. జువాన్ బెలెంకోసో ఆసక్తిగా బంతి కోసం ఎదురుచూస్తున్న సమయంలో వింగర్ రుడియాస్ ఫైన్ పాస్ బాక్స్ లోకి వెళ్లాక వ్రుథాగా మారిపోయింది. ఈ పంతాలన్నీ రెండు జట్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లాల్‌థ్లామౌనా 34వ, 43వ నిమిషాల్లో ఫౌల్స్ చేయడంతో మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+