దాదా కళ్లలో ఆనందహేల: నెటిజన్ల ట్వీట్స్ హోరు
కోచి: మూడేళ్లలో రెండోసారి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్ గెలుచుకున్న అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) జట్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివిధ వర్గాల ప్రముఖులు మొదలు సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ట్వీట్లతో తమ అబిమానాన్ని చాటుకుంటున్నారు. కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన టైటిల్ పోరులో ఇరు జట్లు 1 - 1 స్కోర్ తో సమ ఉజ్జీలుగా నిలవడంతో షూటౌట్ నిర్వహించారు.
ఇందులో కేరళపై కోల్‌కతా 4 - 3 స్కోర్ తేడాతో విజయం సాధించింది. రెండోసారి కూడా కేరళపైనే కోల్ కతా టైటిల్ గెలుచుకోవడం ఆసక్తికర పరిణామం. టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారధ్యంలోని ఎటికె.. ఆయన సహచర క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు ఉండటంతో ట్వీట్ల వెల్లువెత్తింది. దేశీయంగా క్రమంగా ఎదుగుతున్న ఫుట్ బాల్ క్రీడలో కోల్‌కతా చాంపియన్‌గా నిలిచి చరిత్ర నెలకొల్పింది.

ఇండియన్ సూపర్ లీగ్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) యాజమాన్యమే కోల్ కతా జట్టు చాంపియన్‌గా నిలిచిందంటూ ట్వీట్ చేసింది. డిఫెన్స్ వ్యూహంతోనే ఎటికె విజయం సాధించిందని పేర్కొంది. ఎఎఫ్‌సి ఫైనల్స్‌లో బెంగళూరు ఎఫ్ సి తరఫున ప్రాతినిధ్యం వహించిన సికె వినీత్ స్పందిస్తూ కేరళ బ్లాక్ బస్టర్స్‌పై కోల్ కతా తెలివిగా పై చేయి సాధించిందని ట్వీట్ చేశాడు. ట్రోఫీ గెలుచుకునే అర్హత ఎటికె జట్టుకే ఉన్నదన్నాడు.
ముంబై సిటీ ఎఫ్ సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రి గుమారెస్
అట్లెటికో డి కోల్‌కతా (ఎటికె) జట్టును మూడేళ్లలో రెండోసారి చాంపియన్‌గా నిలిపినందుకు కోచ్ జోస్ మొలీనాను ముంబై సిటీ ఎఫ్ సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రి గుమారెస్ అభినందించాడు.
స్టీఫెన్ కాంస్టాటైన్
భారత్ ఫుట్ బాల్ కోచ్ స్టీఫెన్ కాంస్టాటైన్ కూడా ఎటికె జట్టును అభినందించాడు.
మమతాబెనర్జీ
మూడేళ్లలో రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ గెలుచుకున్నందుకు ఎటికె జట్టును అభినందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.. మ్యాచ్ లో పాల్గొన్న రెండు జట్లను ప్రశంసించారు.
అభిషేక్ బచ్చన్
ఫైనల్స్ మ్యాచ్ స్టాండ్స్ నుంచే వీక్షించిన బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గెలుపొందే అర్హత ఎటికెకే ఉన్నదని ట్వీట్ చేశాడు. చెన్నైయిన్ ఎఫ్ సి సహ యజమానిగా అభిషేక్ బచ్చన్ ఉన్నాడు. కష్టపడినా కేరళకు ఫలితం దక్కలేదని, కాలం కలిసి రాలేదని, ఎటికె చాంపియన్ లా ఆడిందన్నాడు.
డేవిడ్ జేమ్స్
మాంఛెస్టర్ సిటీ ప్లస్ ఇంగ్లండ్ మాజీ గోల్ కీపర్ డేవిడ్ జేమ్స్ స్పందిస్తూ మరోసారి కోల్ కతా భీబత్సం నెలకొల్పిందన్నాడు. 2014లో కేరళ సారధి కం హెడ్ కోచ్ గా డేవిడ్ జేమ్స్ వ్యవహరించాడు.
ప్రఫుల్ పటేల్
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ స్పందిస్తూ ఎటికె తెలివిగా ఆడిందని, తద్వారా విజేతగా నిలిచిందని అభినందించాడు.
అల్లు శిరీష్
మెగాస్టార్ మేనల్లుడు అల్లు శిరీష్ సైతం అట్లెటికో డి కోల్ కతా జట్టును అభినందించాడు. తదుపరి ఐఎస్ఎస్ ఎడిషన్ దిశగా ముందడుగు వేద్దామని ట్వీట్ చేశాడు.
దిను అక్షయ్
దిను అక్షయ్ 2.0 అనే వ్యక్తి ట్రోఫీతో దాదా కళ్లలో ఆనంద హేల కనిపిస్తున్నదని ట్వీట్ చేశాడు. ఆయన అభిమానులంతా స్వాగతిస్తున్నారని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications