Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: పుణె ఔట్, సెమీస్‌ బరిలో కోల్‌కతా

కోల్‌కతా: అట్లెటికో డీ కోల్‌కతా (ఎటికె), ఎఫ్‌సి పుణె జట్ల గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిసాయి. శుక్రవారం సాయంత్రం రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గోల్స్ లేకుండానే డ్రా గా ముగిసింది. పుణె కోచ్ అంటోనియో లోపేజ్ హబాస్ సేన ఈ ఏడాది మాజీ చాంపియన్లతో జరిగిన రెండు మ్యాచ్‌లను గెలుచుకోలేకపోయింది.

ఇరు వైపులా ఆటగాళ్లు గోల్ సాధించించేందుకు శతవిధాల ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇది రెండు జట్లకూ ఇది ఎనిమిదో డ్రా కావడం గమనార్హం. ఇప్పటికే సెమీ ఫైనల్స్ దశకు అర్హత సాధించిన ఆతిథ్య కోల్ కతా జట్టు 14 మ్యాచ్‌ల్లో 20 పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా, ఎఫ్ సి సిటీ ఫుణె జట్టు 14 మ్యాచ్‌లకు గాను 16 పాయింట్లతో ఐదో స్థానంలో స్థిరపడింది.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అట్లెటికో డీ కోల్‌కతా ఫార్వర్డ్ ప్లేయర్ జువాన్ బెలెంకోసో నాలుగుసార్లు గోల్ చేసేందుకు వచ్చిన స్పష్టమైన అవకాశాలు మిస్సయ్యాడు. ఇరు జట్లు గోల్స్ కోసం అవకాశాలు కల్పించుకున్నా పరస్పరం ఎదుటి పక్షం యత్నాలను అడ్డుకున్నాయి.

సెమీ ఫైనల్స్‌ కోల్‌కతా

సెమీ ఫైనల్స్‌ కోల్‌కతా

పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన ముంబై సిటీ ఎఫ్ సి, ఢిల్లీ డైనమోస్ మధ్య శనివారం జరిగే మ్యాచ్‌లో విజేతతో సెమీ ఫైనల్స్‌లో తలపడేందుకు అట్లెటికో డీ కోల్‌కతా ఎదురుచూస్తున్నది. కేరళ బ్లాక్ బస్టర్స్‌తో జరిగిన మ్యాచ్ 1 - 1 స్కోర్ తేడాతో డ్రాగా ముగియడంతో కోల్‌కతా మేనేజ్మెంట్ సమూల మార్పులతో జట్టును రంగంలోకి దించింది. సారధి హెల్డర్ పొస్టిగ, బొర్జా ఫెర్నాండెజ్, ఇయాన్ హుమ్ వంటి కీలక ప్లేయర్లకు రెస్ట్‌నిచ్చింది. హెన్రిక్యు సెరెనో, దెబ్జిత్ మజుందార్‌లను కూడా బెంచ్‌కే పరిమితంచేసింది.

ఐదో నిమిషంలో గోల్‌ను నిలువరించిన పుణె కీపర్

ఐదో నిమిషంలో గోల్‌ను నిలువరించిన పుణె కీపర్

పుణె కీపర్ అరిందం భట్టాచార్య ఐదో నిమిషంలో రంగంలోకి దూకేశాడు. అభినాష్ రుడియాస్ ఎడమవైపు నుంచి పంపిన బంతిని రాహుల్ భెకె నిలువరిస్తే.. కోల్ కతా కుర్రాడు జావీ లారా పంపిన ఫ్రీ కిక్‌ను పుణె కీపర్ అరిందం భట్టాచార్య నిలువరించాడు. కొన్ని నిమిషాల తర్వాత ముందుభాగంలో ఉన్న స్పేస్‌ను సద్వినియోగంచేసుకొనేందుకు జావీ లారా రెండోసారి ప్రయత్నించినప్పుడూ అరిందం భట్టాచార్య సేవ్ చేశాడు. మరోవైపు కోల్ కతా ప్లేయర్ బెలెంకోసో పంపిన బంతిని రుడియాస్ గోల్ పోస్ట్ దారి మళ్లించలేకపోయాడు.

పుణె జట్టుకు మరో ఛాన్స్

పుణె జట్టుకు మరో ఛాన్స్

కాగా, ఫస్టాఫ్ ముగిసే సమయానికి పుణె జట్టుకు అనిబల్ రోడ్రిగెజ్ రూపంలో వచ్చిన చాన్స్.. బాక్స్ ఎడ్జ్ వద్ద మిస్సైంది. తత్ఫలితంగా ఫస్టాఫ్ ముగిసే సరికే ఇరు జట్లు కూడా గోల్స్ చేయలేదు.సెకండాఫ్ ప్రారంభమైన ఆరు నిమిషాలకు బెలెంకోసో మరో చాన్స్ మిస్సయ్యాడు. హ్యాండ్ షేక్ డిస్టెన్స్‌లోనే బైద్యనందా సింగ్ పంపిన బంతి బెలెంకోసం గోల్ పోస్ట్ కు పంపగా అది వైడ్‌గా మారింది. ఇక సెకండాఫ్‍లో 72వ నిమిషంలో మొమ్మార్ డోయే స్థానంలో వచ్చిన డ్రామెనె ట్రారోర్, సంజు ప్రధాన్ గోల్స్ చేసే అవకాశాలను మిస్సయ్యారు.

డ్రాగా ముగిసిన మ్యాచ్

డ్రాగా ముగిసిన మ్యాచ్

వీరిద్దరు గోల్స్ చేసే అవకాశాలు మిస్సయ్యాక ఎటికె కోచ్ జోస్ మొలీనా.. స్టీఫెన్ పియర్సన్ స్థానే జువెల్ రాజాను బరిలోకి దించాడు. స్కాట్స్ మ్యాన్ వెంటనే పంపిన బంతిని పుణె కీపర్ అరిందం భట్టాచార్య పక్కకు తప్పించాడు. ఈ దశలో బెలెంకోసో తేలికైన మార్గాల్లోనూ గోల్ చేయడానికి గల అవకాశాలు పరిశీలించినా ప్రయోజనం లేకపోయింది. మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు ఎటికె కీలక ప్లేయర్ ఇయాన్ హుమ్ బరిలోకి దిగినా మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రా గా ముగిసింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+