Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోవా ఆశలు గల్లంతు: సెమీస్‌కు కోల్‌కతా

మార్గోవా: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో టోర్నీ ప్లేఆఫ్ దశకు చేరుకుంటున్నది. ఎఫ్‌సి గోవా 'సెమీస్' ఆశలు గల్లంతయ్యాయి. గోవా సొంతగడ్డ మార్గోవాలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు అట్లెటికో డి కోల్‌కతా 2 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుని మరోసారి సెమీస్ బరిలో నిలిచింది.

ఫస్టాఫ్ 28వ నిమిషంలో జువాన్ కార్లోస్ బెలెంకోసో చేసిన గోల్‌తో కోల్‌కతా లీడ్ సాధించగా, సెకండాఫ్‌లో గోవా కుర్రాళ్లు చెలరేగిపోయారు. 80వ నిమిషంలో మందార్‌రావు దేశాయ్ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. ఇంజ్యూరీ టైమ్ చివరి క్షణంలో స్టీఫెన్ పియర్సన్ సాధించిన గోల్.. కోల్‌కతాను విజయ తీరాలకు చేర్చింది.

వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం

వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం

అట్లెటికో డీ కోల్‌కతా వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపొందిన రికార్డును కొనసాగించడంతోపాటు 12 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ముంబై సిటీ 13 మ్యాచ్‌ల్లో 22 పాయింట్లు పొందిన ముంబై సిటీ టాప్ స్థానంలో ఉంది. ఇక ఎఫ్ సి గోవా జట్టు సెమీ ఫైనల్స్ దశకు దూసుకెళ్లే ఆశలు పూర్తిగా అడుగంటడంతోపాటు 12 మ్యాచ్‌ల్లో కేవలం 11 పాయింట్లు మాత్రమే పొంది పాయింట్ల పట్టికలో దిగువనే స్థిరపడి పోయింది.

విశ్వ ప్రయత్నాలు

విశ్వ ప్రయత్నాలు

అట్లెటికో డి కోల్‌కతా మిడ్ ఫీల్డ్ నుంచి ముందుకు దూసుకెళ్లి పాయింట్లు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. మ్యాచ్ ప్రారంభంలోనే కోల్ కతా ప్లేయర్ జావియర్ లారా గ్రాండె రెండుసార్లు పంపిన బంతిని గోవా గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి అడ్డుకుని జట్టును సేవ్ చేశారు. తొలుత డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చిన గోవా జట్టు.. తర్వాత విజిటర్స్ ఒత్తిడితో 28వ నిమిషంలో గోల్ చేసుకొనేందుకు అవకాశమిచ్చింది. ఎడమవైపు నుంచి హై స్థాయిలో బంతిని క్రాస్ చేసిన అభినాష్ రుడియాస్.. దాన్ని జువాన్ కార్లోస్ రోడ్రిగెజ్ బెలెంకోసోకు పంపాడు.

 41వ నిమిషంలో లీగ్

41వ నిమిషంలో లీగ్

అక్కడ నుంచి బెలెంకోసో చక్కగా కొట్టిన షాట్.. గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణిని అధిగమించి గోల్‌పోస్ట్‌కు చేరుకోవడంతో కోల్‌కతా లీడ్ సాధించింది. కుడివైపు కార్నర్ నుంచి జావియర్ లారా గ్రాండె 41వ నిమిషంలో పంపిన బంతిని కోల్‌కతా సారధి హెల్డర్ పొస్టిగ గోల్‌పోస్ట్‌కు పంపి డబుల్ లీడ్ సాధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్లే ఆఫ్ దశకు దూసుకెళ్లేందుకు వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ గెలువాల్సి ఉన్న గోవా జట్టు ప్రత్యర్థి జట్టు పటిష్ట డిఫెన్స్ వ్యూహం ముందు వెలవెలబోయింది.

సరైన సమయంలో గోవాపై ఒత్తిడి

సరైన సమయంలో గోవాపై ఒత్తిడి

సెకండాఫ్‌లో అన్ని శక్తులు కూడదీసుకుని విజిటర్స్ జట్టును ఎదుర్కొన్నది. రోమియో ఫెర్నాండెజ్‌తో కలిసి జాఫ్ఫ్రీ అటాకింగ్‌కు దిగినా నిష్ప్రయోజనమైంది. సరైన సమయంలోనూ ప్రత్యర్థి జట్టుపై గోవా కుర్రాళ్లు ఒత్తిడి తీసుకొచ్చినా పాయింట్ సాధించలేకపోయారు. స్కోర్ సమం చేసేందుకు సాధ్యం కాకపోవడంతో గోవా కోచ్ జికో అకస్మాత్తుగా మూడు సత్వర మార్పులు చేశాడు. కీనన్ అల్మేడియా, దేబబ్రత రాయ్, త్రిండాడే గాంక్లేవ్స్‌ల స్థానే రాబిన్‌సింగ్, రాజు గైక్వాడ్, జులియో సీజర్ లను రాబిన్ సింగ్ హెడ్డర్ ద్వారా పంపిన బంతి నేరుగా గోల్‌పోస్ట్ దరికి చేరినా కోల్‌కతా గోల్‌కీపర్ దేబ్జిత్ మజుందార్ అడ్డుకోవడంతో పాయింట్ సాధించలేకపోయాడు.

80వ నిమిషంలో స్కోరు సమం

80వ నిమిషంలో స్కోరు సమం

అయితే 80వ నిమిషంలో రాఫెల్ కొయెల్హో పాస్ చేసిన బంతిని మందార్ రావు దేశాయ్ టాప్‌బాక్స్ నుంచి గోల్ పోస్ట్‌కు పంపడంతో స్కోర్ సమమైంది. చివరి 10 నిమిషాల్లో గోవా కుర్రాళ్లు విన్నింగ్ పాయింట్ కోసం అన్వేషణ సాగించారు. డిఫెన్స్ నుంచి ఫార్వర్డ్ దిశగా దూసుకెళ్లారు. డిఫెండర్లు తమ ఫార్వర్డ్ ప్లేయర్లకు అసిస్టెన్స్ అందజేసినా ప్రత్యర్థి జట్ల ప్రతి దాడికి మూల్యం చెల్లించారు. 90వ నిమిషంలో కోల్‌కతా రెండో గోల్ సాధించడంతో విజయం మాజీ చాంపియన్ల ఖాతాలో జమైంది. కోల్‌కతా ప్లేయర్ సమీగ్ దౌటీ స్థానే సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన స్టీఫెన్ పియర్సన్ గోల్‌లో జట్టుకు విజయం సాధించి పెట్టాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+