కోల్‌కతా: మాజీ చాంపియన్ అట్లెటికో డీ కోల్‌కతాకు జంట ఎదురుదెబ్బలు తగిలాయి. రెండు వారాల పాటు వింగర్ బికాశ్‌జైరుకు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చేశారు. ఇక ముంబై సిటీతో మంగళవారం జరిగే మ్యాచ్‌కు హాల్డర్ పొస్టిగ సారధ్యం వహించడం అనుమానమే.
కేరళ బ్లాక్‌బస్టర్స్‌తో కోచిలో జరిగిన మ్యాచ్‌కు కూడా పొస్టిగ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జట్టు కోచ్ జోస్ మొలీనా దృష్టిలో జైరూ అంత ప్రాముఖ్యం లేకున్నా.. ఆయన ఆశలన్నీ విదేశీ ఆటగాళ్లు సమీగ్ డౌటీ, జావీలారాపైనే ఉన్నాయి. ఇక ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ కూడా జట్టులో కీలకం కానున్నాడు.
లా లీగా: బెస్ట్ ప్లేయర్ మెస్సీ
మాడ్రిడ్: లా లీగా లీగ్‌లో పాల్గొన్న ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా బార్సిలోనా క్లబ్ ఆటగాడు లియానెల్ మెస్సీ ఎన్నికయ్యాడు. కానీ మరో కీలక ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు ప్రస్తావనకే రాలేదు.
సెంటర్ రీసెర్చ్ ఫర్ స్పానిష్ ఫుట్‌బాల్ హిస్టరీ అండ్ స్టాటిస్టిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో మెస్సీతోపాటు రౌల్ గొంజాలెజ్, సీజర్ రోగ్రిడ్జ్, టెల్మో జర్రా, ఎన్రైక్యూ కాస్ట్రోల పేర్లు మొదటి వరుసలో నిలిచాయి. 1928 - 29 నుంచి 2015 - 16 వరకు లా లీగా లీగ్‌లో పాల్గొన్న 9.117 మంది క్రీడాకారులు ప్రతిభ, ప్రాతినిధ్యం తదితర అంశాల ఆధారంగా అధ్యయన నివేదిక ఈ ర్యాంక్‌లు ఇచ్చింది.

బాస్కెట్‌బాల్‌లో మాదిరిగా స్కోర్ పాయింట్లు, రీ బౌండ్స్, ఫౌల్స్ ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రతి ఆటగాడు ఆడిన సమయాన్ని బట్టి ఒక్కొక్కరికి 24 పాయింట్లు లభించాయి. ప్రతి పెనాల్టీ గోల్‌కు 0.60, పొరపాటున గోల్స్‌చేస్తే 0.40 పాయింట్లు లభిస్తాయి. ప్రతి రెడ్ కార్డుకు 1.50 పాయింట్లు తగ్గిస్తారు.
1994 - 2010 మధ్య రియల్ మాడ్రిడ్ క్లబ్‌లో ఆడిన రౌల్ గొంజాలేజ్ లిస్ట్‌లో 528 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, నాలుగు పాయింట్లు తక్కువగా పొందిన బార్సిలోనా మాజీ ప్లేయర్ సీజర్ రోడ్రిగౌజ్ (1942 - 1955) తర్వాతీ స్థానంలో నిలిచారు. ప్రస్తుత సీజన్‌లో బార్సిలోనా స్టార్ మెస్సీ.. కెటాలాన్ క్లబ్‌కు 2004లో తొలుత ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి 490 పాయింట్లు పొందాడు.
1968 - 87 మధ్య బార్సిలోనా, స్పోర్టింగ్ జిజాన్‌లలో ఆడిన ఖ్విని 488 పాయింట్లతో ఐదో ర్యాంక్ సాధించాడు. మిగతా 10 టాప్ స్థానాల్లో జువాన్ ఆర్జా, అల్ఫ్రెడో డిస్టెఫానో, ఫ్రాన్సిస్కో జెంటో, కార్లోస్ అలొన్సో 'సాంతిల్లానా', గౌల్లెర్మో గోరోస్టిజా నిలిచారు. లా లీగాలో కీలకమైన క్లబ్ రియల్ మాడ్రిడ్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
మెస్సీ చాంపియన్‌గా రిటైరవ్వాలి
అర్జెంటెనా ఫుట్‌బాల్ కోచ్ హెడ్గార్డో బావుజా.. లా లీగా లీగ్‌లో బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీని ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో విశ్రాంతి పొందుతున్న మెస్సీ ఒక ప్రపంచకప్ గెలుచుకుని రిట్‌కావాలని ఆకాంక్షించాడు. గతంలో మెస్సీ అర్జెంటీనాకు వరుసగా మూడేళ్లపాటు ఫైనల్స్‌కు చేరుకొనే వరకూ ప్రాతినిథ్యం వహించాడు.
2014లో జర్మనీ వరల్డ్ కప్, గత ఏడాది చిలీ వరల్డ్‌కప్, ఈ ఏడాది కోపా అమెరికా జట్ల విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఆగస్టులో బావుజాతో చర్చల తర్వాత బార్సిలోనా క్లబ్‌లో చేరాడు. పంతం కోసమే మెస్సీ బార్సిలోనా క్లబ్‌లో చేరాడే తప్ప, ఆయన దృష్టంతా అర్జెంటీనాపైనేనని బావుజా చెప్పుకొచ్చారు.
తాను ఎప్పుడూ మెస్సీని సంప్రదించి నచ్చజెప్పడానికి కూడా ప్రయత్నించలేదన్నాడు. తమ ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత వారు సిద్ధమైతే జట్టులోకి తీసుకునేందుకు వెనుకాడబోమన్నాడు.