Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడి భావోద్వేగాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్న పొస్టిగ

కోచి: రెండేళ్ల క్రితం కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి జట్టులో అటాకింగ్‌లో .. ప్రస్తుతం రెండోసారి ఎటికె చాంపియన్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించిన ఇయాన్ హుమ్ తన మాజీ జట్టు అభిమానుల్లో ఓటమి భారం కనిపించడం లేదంటున్నారు. మ్యాచ్ జరిగిన వాతావరణం చూస్తే సానుకూలంగా ఉన్నదని పేర్కొన్నాడు. ఎవరిలోనూ ఓటమి పాలైన సంకేతాలు కనిపించలేదని పేర్కొన్నాడు.

నార్మల్ టైంలో చెరో స్కోర్ తో డ్రా దిశగా సాగిన మ్యాచ్ షూటౌట్‌లో కేరళపై ఎటికె 4-3 స్కోర్ తేడాతో రెండోసారి టైటిల్ గెలుచుకున్నది. షూటౌట్‌లో హుమ్ ఫెయిలవ్వడంతో భావోద్వేగానికి గురయ్యాడు. రెండేళ్ల తర్వాత కేరళ ఓటమి పాలవ్వడం ఆ జట్టు అభిమానులను బాధిస్తుందన్నాడు. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయని చెప్పాడు. టాప్ స్థానంలోకి రావడమే గొప్ప అనుభవం అని ఇయాన్ హుమ్ చెప్పాడు.

రెండు జట్లలోనూ ప్రతి క్రీడాకారుడు విజయం కోసం తపించాడన్నాడు. కేరళ అభిమానులు డిజప్పాయింట్ కారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత సీజన్‌లో ఏడు గోల్స్ చేసి టాపర్స్‌లో రెండో వ్యక్తిగా నిలిచాడు. టైటిల్ గెలుపొందిన తర్వాత ఇయాన్ హుమ్ ముఖం చంద్ర బింబంగా వెలిగిపోతూ కనిపించింది. షూటౌట్ లో విఫలమైనా కోల్ కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ మాత్రం షూటౌట్లను దిగ్విజయంగా ఎదుర్కొని జట్టును గెలుపు బాట పట్టించాడు.

ATK's Hume feels for Kerala fans, Postiga says team friendship key to ISL win

రెండున్నర నెలల పాటు తాము పోరాడమన్నారు. గత నాలుగు రోజులుగా ఫైనల్స్ కు చేరుకున్న రెండు జట్లు చాలా కష్ట పడ్డాయన్నాడు. కేరళ ఓటమి పాలవ్వడం ఆ జట్టు సభ్యుల్లో ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందన్నాడు. టోర్నీ పట్ల అభిమానుల్లో అద్భుతమైన సానుకూల వాతావరణం నెలకొన్నదన్నాడు. వచ్చే ఏడాది కూడా అభిమానులు, ప్లేయర్ల మద్దతుతో ముందుకు సాగుతామని ఆశాభావం వ్యక్తంచేశాడు.

రెండు జట్లకు కూడా టైటిల్ గెలుచుకునే అర్హత ఉన్నదని తెలిపాడు. హ్రుదయ పూర్వకంగా మ్యాచ్ ఆడాయన్నాడు. దురద్రుష్టవశాత్తు ఎవరో ఒకరు ఓడిపోవాలి కదా? అన్నాడు. జట్టు విజయం సాధించినందుకు తాను వ్యక్తిగతంగా పండుగ చేసుకుంటానన్నాడు. కోల్‌కతా సారధి హెల్డర్ పొస్టిగ స్పందిస్తూ జట్టులోని వారంతా సహోదర భావంతో ఉమ్మడిగా కష్టపడటం వల్లే టైటిల్ గెలుచుకోగలిగామన్నాడు.

టీం బాండ్ సంపాదించకుండా గెలుపొందడం సాధ్యం కాదన్నాడు. తమ మధ్య స్నేహభావం ఈ దిశగా ముందుకు నడిపించిందని పొస్టిగ వ్యాఖ్యానించాడు. తమ మధ్య ఫ్రెండ్ షిప్ బలోపేతం కావడంతోపాటు ప్లేయర్లలో నైపుణ్యం అద్భుతంగా మెరుగు పడిందన్నాడు. రెండోసారి టైటిల్ గెలుచుకోవడాన్ని తానెప్పటికి మరిచిపోలేనని తెలిపాడు.

తమకు ఈ మ్యాచ్ చాలా కష్టంగా పరిణమించిందని పొస్టిగ అన్నాడు. కోల్ కతా నుంచి ఇయాన్ హుమ్, కేరళ సెడ్రిక్ హెంగ్బార్ట్ కూడా పెనాల్టీ షూటౌట్ మిస్సాయరని గుర్తుచేశాడు. యావత్ కోల్ కతా టీం అంతా ఉమ్మడిగా కలిసి పనిచేసిందని ప్రశంసించాడు. ఫుట్ బాల్ క్రీడాకారులకు టైటిల్ గెలుచుకోవడమే చాలా ముఖ్యమని తెలిపాడు. ఈ తీపి గుర్తులను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని వ్యాఖ్యానించాడు. ప్రాక్టీసింగ్ ద్వారానే పెనాల్టీలను నిర్ణయించగలనమి తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+