Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలుపే లక్ష్యంగా కోల్‌కతా Vs ముంబై: ఎవరిది పైచేయి?

కోల్‌కతా: మూడు వరుస డ్రాల తర్వాత సొంత గడ్డపై మ్యాచ్ గెలుచుకున్న అట్లెటికో డీ కోల్‌కతా (ఎటికె) మంగళవారం కోల్ కతా నగరంలోని రవీంద్ర సరోవర్ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్ సి జట్టుపై జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి టాప్‌కు దూసుకెళ్లాలని ముచ్చట పడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తొలి ఐఎస్ఎల్ చాంపియన్ అయిన అట్లెటికో డీ కోల్ కతా ఈ ఏడాది సీజన్‌లో ఇంతవరకు ఓటమే ఎరుగకుండా ముందుకెళుతున్నది. మరోవైపు ముంబై సిటీ మేనేజర్ అలెగ్జాండ్రీ గుమారెస్ సైతం ఎటికెను ఓడిస్తే టాప్ కెళ్లవచ్చునని ఉవ్విళ్లూరుతున్నాడు.

ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై సిటీ.. ఈ మ్యాచ్ లో గెలుపొందితే టాప్‌కు వచ్చేస్తుంది. అయితే ఈ ఏడాది ముంబైలో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. 2014లో సొంతగడ్డపై ఒకటి, గతేడాది ఒకటి గెలిస్తే.. ముంబై.. తొలిసారి 2-1, గతేడాది 3-2 స్కోర్ తేడాతో ఒక్కో మ్యాచ్ గెలుపొందాయి.

ATK host Mumbai as both sides aim to go top

మాస్టర్ క్లాస్ ఆటగాడు తిరి గాయం నుంచి కోలుకున్న తర్వాత కోల్ కతాలో చేరడంతోపాటు ఢిల్లీపై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటాకింగ్, డిఫెన్సివ్ ఆటకు పెట్టింది పేరు తిరి. అర్నాబ్ మొండల్, హెన్రిక్య్ సెరెనోలతో కలిసి తిరి మంగళవారం మ్యాచ్‌లో పాల్గొననున్నాడు.

ఇక గాయంతో బాధపడుతూ వరుసగా మూడు మ్యాచ్ లకు దూరంగా ఉన్న ముంబై సారధి డియాగో ఫోర్లాన్ ఈ మ్యాచ్ లోనైనా బరిలోకి దిగుతాడని జట్టు యాజమాన్యం ఆశలు పెట్టుకున్నది. తొలి రెండు మ్యాచ్ ల్లోనూ గోల్స్ తో జట్టు ను విజయ తీరాలకు నడిపించిన ఫోర్లాన్ రాకపై అంతా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

క్రితం మ్యాచ్‌లో కొద్దిసేపు మెరుపులు మెరిపించి గాయం కారణంగా బెంచ్ కే పరిమితమైన జావీ లారా.. కోల్ కతాకు పెద్ద అసెట్. ప్రస్తుత సీజన్ లో జట్టుకు ప్రభావితమైన ఆటగాడిగా అండగా నిలిచాడు. మిడిల్ లోనూ, ఇరువైపులా ప్రత్యర్థిని డిఫెన్స్ లో పెట్టగల సమర్థుడు. ఈ సీజన్ లో రెండుసార్లు గోల్స్ చేసిన లారా.. తొలుత ముంబైతో జరిగిన మ్యాచ్ డ్రాకు కీలకమయ్యారు.

ఇక ముంబై ప్లేయర్ సోనీ నోర్డే.. ఆతిథ్య జట్టుకు అత్యంత ప్రమాదకారి కానున్నాడు. గత ఏడాది మ్యాచ్ లో ఇదే కోల్ కతాలో స్టాల్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 3 - 2 స్కోర్ తేడాతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది నాలుగు మ్యాచ్ ల్లో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించిన నోర్డే మరోసారి కోల్ కతాపై దాడిచేస్తాడా? గత ఏడాది పరాజయానికి కోల్ కతా అతడిపై ప్రతీకారం తీర్చుకుంటుందా? వేచి చూడాల్సిందే.

ఇంతకుముందు ఢిల్లీ ఎఫ్ సితో జరిగిన మ్యాచ్‌లో లీగ్ చరిత్రలోనే టాప్ స్కోరర్ ఇయాన్‌హుమ్.. కోల్ కతాకు పెద్ద అండ. ఐఎస్ఎల్ టోర్నీలోనే 18 గోల్స్ చేసిన రికార్డు ఇయాన్ హుమ్ పేరిట ఉంది. గతంలోనూ ముంబైకి వ్యతిరేకంగా ఆడిన హుమ్.. మంగళవారం ప్రారంభంలోనే శుభారంభాన్ని అందుకోవాలని అభిలషిస్తున్నాడు.

లుసియాన్ గోయాన్ గత ఆరు మ్యాచ్ ల్లోనూ ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించడంతోపాటు జట్టుకు బ్యాక్ లైన్ వద్ద మార్షల్ గా నిలుస్తాడని భావిస్తున్నారు. అయితే గాయం కారణంగా అన్వర్ అలీ లేకపోవడం గోయాన్ పై భారం పడే అవకాశముంది. రోమేనియన్ డిఫెండరైన నోయాన్.. ప్రమాదం ముంచుకొస్తుందని అంచనాకు వచ్చినప్పుడల్లా కోల్ కతాపై విరుచుకు పడి జట్టుకు కాపాడుకోగలడని అంచనా వేస్తున్నారు.

గత నాలుగు మ్యాచ్ ల్లోనూ కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించిన ముంబై కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్.. కోల్ కతాను అండర్ డాగ్ గా పరిగణించొద్దని తన కుర్రాళ్లను హెచ్చరించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ను 1 - 0 స్కోర్ తేడాతో గెలుచుకున్న కోల్ కతా పూర్తి ఆత్మ విశ్వాసంతో ముంబైపై పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో గుమారెస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఒకవేళ ఢిల్లీ కుర్రాళ్లు పెనాల్టీని గోల్ గా మార్చినా పరిస్థితి విభిన్నంగా ఉండేదన్నా. జోస్ మొలీనా శిష్యుల ప్రతిభ స్ఫూర్తిదాయకంగా ఉన్నదని గుమారెస్ వ్యాఖ్యానించాడు. టైటిల్ ను గెలుచుకోవాలని అత్యధికంగా తపన పడుతున్న జట్టుతో తల పడుతున్నామన్న సంగతి గుర్తుంచుకోవాలని తన కుర్రాళ్లకు గుమారెస్ హితబోధ చేశాడు.

ఇదిలా ఉంటే పెర్మార్ఫెన్స్ సరిగ్గా లేని ముంబైపై విజయం సాధించి టైటిల్ పై అంతకుముందు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని కోల్ కతా మేనేజర్ జోస్ మొలీనా ఆకాంక్షిస్తున్నాడు. గత నాలుగు మ్యాచ్ ల్లోనూ కేవలం రెండు పాయింట్లు మాత్రమే ముంబై సాధించడం దాని ఫేలవమైన ఆటతీరుకు నిదర్శనంగా ఉన్నది.

ఈ నేపథ్యంలో ముంబైపై విజయం సాధించి.. టాప్ లో చేరిపోవాలని భావిస్తున్నాడు. ముంబైలో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. మిడ్ ఫీల్డర్లు, డిఫెండర్లు, అటాకర్లు, మంచి గోల్ కీపర్ ఉన్నారని ప్రశంసించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+