Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాయ్ అకాడమీ నుంచి జువెల్ రాజా పరార్

కోల్‌కతా: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో రెండోసారి టైటిల్ గెలుచుకున్న అట్లెటికో డి కోల్ కతా జట్టు ప్లేయర్ జువెల్ రాజాకు కోల్ కతాలో సాదర స్వాగతం లభించింది. ఐదో పెనాల్టీ షూటౌట్ ద్వారా గోల్ సాధించడం ద్వారా జువెల్ రాజా టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర వహించాడు మరి. ఈ మిడ్ ఫీల్డ్ ప్లేయర్ కు ఆయన సొంత గ్రామం అచిపూర్‌లో గ్రామస్తులంతా మన:స్ఫూర్తిగా స్వాగతం పలికారు.

అచిపూర్ గ్రామం కోల్ కతా నగరానికి 65కిలోమీటర్ల దూరంలో గంగా నదీ తీరాన్నే ఉంటుంది. ఇప్పటికీ ఫుట్‌బాల్ ఆటలో తన కెరీర్‌పై ఆసక్తిగా చూపుతున్న జువెల్ రాజాకు వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఐ - లీగ్ టోర్నీలో పాల్గొనేందుకు ఆయా జట్ల నుంచి పిలుపు రాలేదు. అయితే చిన్ననాటి రోజుల్లో తాను చేసిన అడ్వెంచర్ ను బయటపెట్టాడీ కుర్రాడు.

క్రిస్టియానో రొనాల్డో మాదిరిగానే చిన్నప్పుడు ఫుట్ బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు. 12 ఏళ్ల వయస్సులో తనకు కోల్ కతాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో శిక్షణ పొందేందుకు అవకాశమొచ్చిందని చెప్పాడు. కానీ నాకు అప్పుడు మానసికంగా తల్లితో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రారంభంలోనే ఆమె నుంచి దూరమై సాయ్ హాస్టల్ లో జీవనం సాగించాల్సి వస్తుందని తానస్సలు ఊహించలేదన్నాడు.

 ATK hero Jewel Raja once fled from SAI academy

తన ప్రవర్తన గమనించిన తన తండ్రి బలవంతంగా తనను తీసుకెళ్లి సాయ్ హాస్టల్ లో చేర్చాడని గుర్తుచేసుకున్నాడు. తన అభిరుచిని గమనించిన తన తండ్రి.. తన సోదరుడు తారిఖ్ మాదిరిగానే విజయవంతమైన ఫుట్ బాల్ ప్లేయర్ గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించుకున్నాడు. కానీ తాను ఎల్లవేళలా తల్లితోనే గడిపేందుకే ప్రాధాన్యం ఇచ్చే వాడినన్నాడు.

దాని ప్రభావం వల్లే సాయ్ అకాడమీ హాస్టల్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒకరోజు ఉదయం హాస్టల్ నుంచి పారిపోయానన్నాడు. ఇంటికెళ్లే లక్ష్యంతో బయటకు వచ్చిన తనకు కోల్ కతా నుంచి అచిపూర్ ఎలా వెళ్లాలో తెలియక తిరిగి హాస్టల్‌కు చేరుకున్నానని చెప్పాడు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో తన తల్లి ఫోన్ లో మాట్లాడిందని, తీవ్రంగా మందలించిందని పేర్కొన్నాడు.

ముందుగా ఫుట్ బాల్ ఆటపైనే ద్రుష్టిని కేంద్రీకరించాలని సూచించిందని చెప్పాడు. చిన్నప్పుడు క్రికెట్ ఆడానని, అంతర్ జిల్లా టోర్నీలో గ్రామ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించానన్నాడు. కానీ తన తండ్రి నూరుల్ రాణా మాత్రం ముందుగా తన సోదరుడు తారిఖ్ మాదిరిగా ఫుట్‌బాల్ ఆటపై కేంద్రీకరించాలని సలహా ఇచ్చాడు. తన సోదరుడు తారిఖ్ కూడా జువెల్ ను ఏదైనా ఐ - లీగ్ క్లబ్ లో చేర్చకపోతే తానూ ఆసక్తిని కోల్పోతానని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+