కోచి: ఐఎస్‌ఎల్ 3వ ఎడిషన్‌లో అట్లెటికో డీ కోల్‌కతా (ఎటికె) బోణీ కొట్టింది. కేరళ బ్లాక్‌బస్టర్స్‌పై బుధవారం కోచిలో జరిగిన హోరాహోరీ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 53వ నిమిషంలో సందేశ్ జిజ్ఞాసిని అడ్డుకుని జావీ లారా షాట్ కొట్టడంతో కోల్‌కతా ఒక పాయింట్ లీడ్ సాధించింది.
అంతకు ముందు నాలుగో నిమిషంలో ఎటికె కీలక ఆటగాడు ఇయాన్‌హుమ్.. కుడివైపున ఉన్న స్పేస్‌ను గమనించి బంతిని కట్‌చేసి కెప్టెన్ పొస్టిగకు అందించాడు. కానీ కేరళకు చెందిన ప్రతీక్ చౌదరి అడ్డుకోవడంతో పోస్టిగ గోల్ చేయలేక పోగా గాయంతో పక్కకు వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పొస్టిగ వైదొలిగినా ఎటికె బాయ్స్ సమీగ్ డౌటీ, లారాల ద్వయం కేరళ డిఫెన్స్‌ను తుత్తునియలు చేసేసింది. కేరళ గోల్ కీపర్ 26 నిమిషంలో రెండుసార్లు గోల్ సాధించకుండా అడ్డుకోవడంతో ఎటికె దూకుడు సత్ఫలితానివ్వలేదు. అదే సమయంలో బ్లాస్టర్స్ రెస్పాండ్ అయినా డకెన్స్ నాజోన్ బై లైన్ మీదుగా కొట్టిన బంతి లక్ష్యానికి చేరుకోలేకపోయింది.
రెండో హాఫ్‌లో గానీ కోల్‌కతాకు సదవకాశం లభించలేదు. కుడివైపున ఉన్న దౌటీ బంతిని క్రాస్‌చేయడంతో బెలెన్కోసో గోల్‌పోస్ట్‌కు పంపేందుకు ప్రయత్నించాడు. కానీ 53వ నిమిషంలో గానీ కోల్‌కతా జట్టు సక్సెస్ సాధించలేకపోయింది. 53వ నిమిషంలో గోల్‌పోస్ట్ సమీపాన ఇతరులెవ్వరూ లేకపోవడం లారా లక్కు కలిసొచ్చి గోల్‌చేశాడు. ఎటికె జాతకం తిరగబడింది.

తొలి హాఫ్ ముగియడానికి ముందు కేరళ గోల్‌చేయడానికి చివరి అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేక చతికిల పడింది. మెహ్తాబ్ హుస్సేన్ నుంచి బంతి కేరళ కుర్రాళ్లకు చేరుకున్నా.. దాన్ని గోల్‌పోస్ట్‌కు చేర్చలేకపోయారు. 31వ నిమిషంలో జెర్మన్ మరోసారి కోల్‌కతా మధ్య నుంచి బంతిని తమ ఆధీనంలోకి తీసుకుని షాట్ కొట్టినా.. తర్వాత మరో రెండు నిమిషాలకు మహ్మద్ రఫీఖ్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ముందు నుంచి డిఫెన్స్, అటాకింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేరళ బ్లాక్‌బస్టర్స్ స్థానిక అభిమానుల మద్దతుతో చివరి 10 నిమిషాల్లో ప్రత్యర్థిని నిలువరించకపోయినా కనీసం డ్రా చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయ్యాయి. ప్రత్యర్థి జట్టు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగంలోనూ కేరళ పూర్తిగా విఫలమైంది.
ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని కేరళ బ్లాక్‌బస్టర్స్ కోచ్ స్టీవ్ కోపెల్ వ్యాఖ్యానించాడు. అన్ని విధాలుగా మ్యాచ్‌పై నియంత్రణ గల జట్టుతో ఆడటం కష్టమైన పనేనన్నాడు. తమ జట్టు ఆటగాళ్లలో చాలా మంది గాయాలతో బాధ పడుతున్నారని వివరించాడు.
అటాకింగ్‌తో గోల్‌చేసేందుకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోయిన మాట వాస్తవమేనన్నాడు. గతానుభవాలను నెమరు వేసుకుంటూ కూర్చుంటే ఫలితం సాధించలేమని వ్యాఖ్యానించాడు. తమ జట్టు సభ్యుల్లో వ్యక్తిగత ఆటతీరు, సమిష్టితత్వం మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్న స్టీఫెల్.. జట్టు సారధి అరెన్ హుగెస్ లేని లోటు మ్యాచ్‌పై స్పష్టంగా కనిపించిందని అన్నాడు.
ఇక 53వ నిమిషంలో అదృష్టం కలిసొచ్చి గోల్ చేయడంతో మ్యాచ్ గెలుపొందిన కోల్‌కతా కోచ్ ఫ్రాన్సిస్కో మొలీనా ఈ దఫా ఎటువంటి కంప్లయింట్లు లేవన్నాడు. తన ప్లేయర్ల ఆటతీరుపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశాడు.
ఆదివారం చెన్నైయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా కష్ట పడాల్సి వచ్చిందన్న మొలీనా.. బుధవారం కేరళ బ్లాక్‌బస్టర్స్‌తోనూ జరిగిన మ్యాచ్‌లోనూ అదేస్థాయిలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా తామిక్కడకు వచ్చామని చమత్కరించారు. డిఫెండర్ రోబర్ట్ లాల్తామౌనా గాయపడడంతో బుధవారం టీమ్‌లో చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని మొలీనా అంగీకరించాడు.