Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFC Asian Cup 2023: ఆస్ట్రేలియా‌పై విజయం.. సెమీస్‌కు సౌత్‌ కొరియా

ఎఎఫ్‌సీ ఏషియన్ కప్ టైటిల్ ఆశలను సౌత్ కొరియా సజీవంగా ఉంచుకుంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుతం చేసింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సన్ హ్యూంగ్ మిన్ సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాన్నందుకుంది.

ఆఖరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌత్ కొరియా 2-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో సన్ హ్యూంగ్-మిన్ చేసిన గోల్‌... సౌత్ కొరియా‌కు విజయాన్ని అందించింది. దాంతో సౌత్ కొరియా మూడో సారి ఏషియన్ కప్ టైటిల్ గెలిచే ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Son the hero as South Korea

1960 తర్వాత సౌత్‌కొరియా ఏషియన్ కప్ టైటిల్ గెలవలేదు. 2015లో ఇదే సౌత్‌కొరియా‌పై ఫైనల్లో ఎక్స్‌ట్రా టైమ్‌లో గోల్ చేసిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. కానీ ఈ సారి ఆస్ట్రేలియాను ఓడించి సౌత్‌కొరియా ప్రతికారం తీర్చుకుంది.

'2015 ఫైనల్ పరాజయం మాకు తీరని మనోవేధనను మిగిల్చింది. ఆ పరాజయానికి ఈ విజయం ప్రతీకారమని నేను చెప్పడం లేదు. ఫుట్‌బాల్‌లో గెలుపొటములు సహజం. ఆ పరాజయం నా పరిపక్వతను పెంచింది.'అని సన్ హ్యూంగ్-మిన్ చెప్పుకొచ్చాడు.

మరో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో 1-0తో తజికిస్థాన్‌ను ఓడించిన జోర్డాన్‌తో దక్షిణ కొరియా మంగళవారం తొలి సెమీఫైనల్ ఆడనుంది. గ్రూప్ స్టేజిలో జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌ను సౌత్ కొరియా 2-2తో డ్రా చేసుకుంది.

'ఈ మ్యాచ్ ఓ డ్రామాను తలపించింది. ఈ విజయం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. థ్రిల్‌గా ఫిలయ్యాం. ఆస్ట్రేలియాపై కష్టపడి గెలిచాం. ఈ ఫలితాన్ని మేం అంచనా వేసాం. కానీ మళ్లీ 120 నిమిషాల పాటు ఆట కొనసాగడంతో కాస్త కంగారుకు గురయ్యాం. మా జట్టు ఆటతీరు పట్ల గర్వపడుతున్నాను'అని సౌత్ కొరియా కోచ్ జుర్గెన్ క్లిన్స్‌మన్ అన్నాడు.

ప్రస్తుతం తాము సెమీఫైనల్‌కు చేరామని, జోర్డాన్‌తో తొలి నాకౌట్ మ్యాచ్ ఆడనున్నామని జుర్గెన్ చెప్పుకొచ్చాడు. తమ గ్రూప్ నుంచే రెండు జట్లు సెమీస్ చేరాయని, తమ గ్రూప్ ఎంత కఠినంగా ఉందో ఈ ఫలితాలను చూస్తే అందరికి అర్ధమవుతుందన్నాడు.

ఈ మ్యాచ్‌లో హాఫ్ టైమ్ ముగిసే సరికి ఆస్ట్రేలియానే ఆధిక్యంలో నిలిచింది. కానీ కీలక సమయంలో పుంజుకొన్న సౌత్ కొరియా వ్యూహాత్మక గేమ్‌తో వరుస పాయింట్లను సొంతం చేసుకుంది. ఎక్స్‌ట్రా టైమ్‌లో సన్ సూపర్ గోల్‌తో సౌత్ కొరియా విజయాన్ని లాంఛనం చేశాడు.

Story first published: Saturday, February 3, 2024, 23:19 [IST]
Other articles published on Feb 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+