ఆసియా కప్‌లో అయిదు సార్లు టైటిల్‌ను అందుకున్న జపాన్ ఈసారి అదే జోరును కొనసాగిస్తుంది. బుధవరాం బహ్రెయిన్‌ను 3-1తో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు జపాన్ అర్హత సాధించింది. గ్రూప్-డిలో ఇరాక్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైన తర్వాత గొప్పగా పుంజుకుని విజయాలతో హోరెత్తిస్తుంది. శనివారం ఇరాన్‌తో క్వార్టర్ ఫైనల్‌లో తలపడనుంది.
జపాన్ జట్టులో రిట్సు డోన్, టేక్‌ఫుసా కుబో, అయాసే ఉడా గోల్‌లు కొట్టారు. మరోవైపు బహ్రెయిన్ జట్టులో జియోన్ సుజుకి మాత్రమే గోల్ సాధించాడు. అతడి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలగింది. 31వ నిమిషంలో జపాన్ డిఫెండర్ సేయా మైకుమా లాంగ్-రేంజ్ షాట్ పోస్ట్ అనంతరం మ్యాచ్ మలుపు తిరిగింది. డోన్ రీబౌండ్‌లో గోల్‌గా మార్చాడు.

రెండో అర్ధభాగం ప్రారంభమైన నాలుగు నిమిషాలకు జపాన్ మరో గోల్ సాధించింది. కుబో గోల్ కొట్టి ఆధిక్యాన్ని రెట్టింపు చేసాడు.స్పిన్ చేస్తూ దగ్గరి నుండి గోల్ చేశాడు. అనంతరం ఆట ఆసక్తిగా సాగింది. అయితే బహ్రెయిన్ కీపర్ ఇబ్రహీం లుట్‌ఫాల్లాను బోల్తా కొట్టించడానికి అయాసే సుమారు ఎనిమిది నిమిషాల పాటు పోరాడి గోల్ కొట్టాడు.
మరో మ్యాచ్‌లో సిరియాపై ఇరాన్ పెనాల్టీ షూట్ అవుట్‌లో నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. తొలుత 1-1తో మ్యాచ్ టైగా ముగిసింది. కానీ ఆ తర్వాత పెనాల్టీ షూట్ మూడు సార్లు ఛాంపియన్ ఇరాన్ 5-3తో గెలిచింది. ఆసియా కప్‌లో మొదటిసారి నాకౌట్ దశకు చేరుకున్న సిరియా పోరాటం ఈ మ్యాచ్‌తో ముగిసింది. మరోవైపు ఇరాన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది ఎనిమిదోసారి.