ఆసియా కప్ సెమీ ఫైనల్‌కు ఇరాన్ అర్హత సాధించింది. చివరి నిమిషంలో పెనాల్టీ షూట్‌తో అలీరెజా జహన్‌బక్ష్ గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. దీంతో జపాన్‌పై ఇరాన్ 2-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆతిథ్య జట్టు ఖతార్‌తో సెమీస్‌లో ఇరాన్ తలపడనుంది.
అయితే ఆసియా కప్‌ను మూడు సార్లు సొంతం చేసుకున్న ఇరాన్ చివరిగా 1976లో గెలిచింది. తిరిగి ఇరాన్‌ను టైటిల్ రేసులో నిలబెట్టడానికి జహన్‌బక్ష్ 96వ నిమిషంలో కూల్‌గా గోల్ కొట్టాడు. ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ ఆసక్తికర క్వార్టర్ ఫైనల్‌లో ఫస్ట్ హాఫ్‌లో జపాన్ ముందంజలో నిలిచింది. హిడెమాసా మోరిటా గోల్ సాధించి ఇరాన్‌పై తమ జట్టు పైచేయి సాధించేలా చేశాడు.

కానీ మహ్మద్ మొహెబీ 55వ నిమిషంలో స్కోర్‌ను సమం చేసి జపాన్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత జహన్‌బక్ష్ చివర్లో వీరోచిత పోరాటంతో సెమీస్‌కు రూట్ క్లియర్ చేశాడు. కాగా, స్టార్ స్ట్రైకర్ మెహదీ తారేమీ లేకుండానే ఇరాన్ విజయం సాధించడం విశేషం. అతడు ఆటలో సస్పెండ్‌కు గురయ్యాడు.
మరోవైపు ఉజ్బెకిస్థాన్‌పై విజయం సాధించి ఖతార్ సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది. అల్ బేట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. కానీ పెనాల్టీ షూట్‌లో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించి ఖతార్ టైటిల్‌పై ఆశలు నిలబెట్టుకుంది. ఉత్కిర్ యూసుపోవ్ గోల్ సాధించడంతో మొదటి అర్ధభాగంలో ఖతార్ ఆధిక్యంలో నిలిచింది.
కానీ విరామం తర్వాత ఉజ్బెకిస్తాన్ పుంజుకుంది. ఓడిల్జోన్ హమ్రోబెకోవ్ గోల్ చేసి స్కోరును సమం చేసి మ్యాచ్‌ను పెనాల్టీ షూట్‌లకు చేర్చాడు. అయితే ఖతార్ ప్లేయర్లు అల్మోజ్ అలీ, అల్మహదీ అలీ ఇద్దరూ షూట్-అవుట్‌లో విఫలమయ్యారు.కానీ జలోలిద్దీన్ మషరిపోవ్ మిస్ కారణంగా పెడ్రో మిగ్యుల్ ఖతార్ హీరోగా మారాడు. కాగా, మంగళవారం జొర్డాన్‌తో దక్షిణ కొరియా తలపడనుంది. అలాగే ఖతార్‌తో ఇరాన్ బుధవారం పోటీపడనుంది.