Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇపిఎల్ టైటిల్ మాదే: ధీమాగా అర్సెన్ వింగర్

లండన్: సరిగ్గా ఆడితే ఈ దఫా ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టైటిల్ తమదేనని ఆర్సెనల్ టీం మేనేజర్ అర్సెన్ వింగర్ తేల్చి చెప్పాడు. లివర్ పూల్ ఎఫ్‌సి జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ నుంచి అర్సెనల్ అజేయంగా సాగుతున్నది. తద్వారా ఇపిఎల్ పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.

దీనికంటే చెల్సియా మూడు పాయింట్లతో మొదటిస్థానంలో సెటిలైంది. మూడు రోజుల క్రితం లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో తన సిటీ ప్రత్యర్థి వెస్ట్ హమ్ యునైటెడ్ జట్టును 5-1 స్కోర్ తేడాతో ఓడించింది. అలెక్సిస్ సాంచెజ్ మిరుమిట్లు గొలిపే విధంగా హ్యాట్రిక్ గోల్స్ సాధించగా, మెసుట్ ఒజిల్, అలెక్స్ అక్స్‌లాడ్ చెరో గోల్ చేసి వెస్ట్ హామ్ పై విజయంలో కీలకపాత్ర పోషించారు.

అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించినందుకు అర్రెస్ వింగర్ తన కుర్రాళ్లను అభినందనల్లో ముంచెత్తాడు. 'మేం చాలా బాగా ఆడాం. మెరుగు పడేందుకు మాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి నాణ్యతతో కూడిన ఆటతీరు ప్రదర్శిస్తూ మా అవకాశాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నాం. గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఆడాం. ఈ ఏడాది మేం కేవలం 20 శాతం అవకాశాలు మాత్రమే మిస్సయ్యాం. గతేడాది చాలా ఎక్కువగా కోల్పోయాం' అని అన్నాడు.

ఆర్సెనల్ గట్టి పోటీదారు

ఆర్సెనల్ గట్టి పోటీదారు

జట్టు అద్భుతంగా ఆడుతుండటంతో తన మనోభావాలను కప్పి పెట్టుకోలేక పోతున్నట్లు తెలిపాడు. పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలవడమే సరిపోదన్నాడు. తప్పనిసరిగా ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకునేందుకు ఆర్సెనల్ గట్టి పోటీదారు అని పేర్కొన్నాడు. ఒకవేళ ఆర్సెనల్ క్లబ్ జట్టు విజయం సాధిస్తే అది దశాబ్ధ కాలానికి పైగా విరామం తర్వాతే రికార్డు నెలకొల్పినట్లవుతుంది. ఇంతకుముందు గన్నర్స్ జట్టుపై టైటిల్ గెలుచుకున్న మాంఛెస్టర్ సిటీ రెండు ఎఫ్ఎ టైటిళ్లు, ఒక కమ్యూనిటీ షీల్డ్ గెలుచుకున్నది.

ఆ నిషేధంతో కష్టాల్లో మాంఛెస్టర్ సిటీ

ఆ నిషేధంతో కష్టాల్లో మాంఛెస్టర్ సిటీ

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్)లో మాంఛెస్టర్ సిటీ స్ట్రయికర్ సెర్జియో అగౌరెపై నాలుగు మ్యాచ్ నిషేధంతో టైటిల్ కైవసంపై జట్టు అడియాసలే కానున్నాయి. అగౌరెపై నిషేధాన్ని ఫుట్ బాల్ అసోసియేషన్ (ఎఫ్ఎ) ధ్రువీకరించింది. చెల్సియాతో జరిగిన మ్యాచ్‌లోనే అగౌరెకు రెడ్ కార్డు చూపారు. చెల్సియా డిఫెండర్ డేవిడ్ లూయిజ్ కాళ్లలోకి దూసుకెళ్లి రెండు ఫౌల్స్ చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్లేయర్లు, సారధులు, కోచ్‌ల మధ్య ఘర్షణ

ప్లేయర్లు, సారధులు, కోచ్‌ల మధ్య ఘర్షణ

మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్లు, సారధులు, కోచ్‌ల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇపిఎల్ నిర్వాహకులు అగౌరెపై నిషేధం అమలుచేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత సీజన్‌లో జట్టు తరపున 16 గోల్స్ సాధించిన ఈ అర్జెంటీనా ఇంటర్నేషనల్ తదుపరి లైసెస్టర్, వాట్ఫోర్డ్, ఆర్సెనల్, హుల్ జట్లతో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

సస్పెన్షన్ కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరం

సస్పెన్షన్ కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరం

ఇప్పటికే వెస్ట్ హామ్ ప్లేయర్ విన్స‌టన్ రీడ్ ఎల్బోపై దాడితో సస్పెన్షన్ కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. తాజా సస్పెన్షన్‌తో ఇపిఎల్ టైటిల్ గెలుచుకోవాలన్న మాంఛెస్టర్ సిటీ కలలు కల్లలయ్యే అవకాశముంది. మరోవైపు షోవింగ్ సెస్ ఫాబ్రెగాస్‌తో జరిగిన ఘటనతో మాంఛెస్టర్ సిటీ ఫెర్నాండిన్హో మూడు మ్యాచ్ ల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. చెల్సియా, మాంఛెస్టర్ సిటీ జట్లు తమ ప్లేయర్లపై నియంత్రణ కోల్పోవడంతో ప్రస్తుతం చెరో మూడు మ్యాచ్ లు దూరం కానున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+