డిన్నర్ ముగిసింది.. వంద కోట్ల డీల్ దొరికింది.

Posted By:
Arjen Robben opens up about desire for switch to Manchester United

హైదరాబాద్: డచ్ అండ్ బేయర్న్ మునిచ్ క్లబ్‌కు చెందిన లెజెండ్, స్టార్ ఆటగాడు అర్జెన్ రాబెన్ మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు మారేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అలెక్స్ ఫెర్గ్యూసన్‌తో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అతను ఇప్పటి వరకు చిల్సీ జట్టుకు బదిలీ అవుదామనే యోచనలో ఉండగా మాంచెస్టర్ యునైటెడ్ డీల్ ఆఫర్ చేయడంతో మారిపోయాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసా.. 109 కోట్ల రూపాయలకు పైగా జీతాన్ని చెల్లిస్తాననడమే.

పీఎస్‌వీ ఎన్‌దొవన్‌కు 2002-03 సంవత్సరానికి గాను లీగ్ గెలుచుకోవడంతో రాబెన్ కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి ఇదే జట్టుకు అంటిపెట్టుకుని ఉన్న తగినంత స్థాయిలో వేతనం చెల్లించడం లేదనే జట్టు మారిపోతున్నాడట. ఇదే విషయంపై మాంచెస్టర్ యునైటెడ్ జట్టు యజమాని అలెక్స్ ఫెర్యూసన్ చర్చించగా అతని ఆఫర్‌కు తలొగ్గాడు.

ఇప్పటి వరకు రాబిన్ కెరీర్‌లో ఎఫ్ఏ కప్, లీగ్ కప్, ఎఫ్ఏ కమ్యూనిటీ షీల్డ్ వంటి పలు లీగ్‌లు సాధించడంలో జట్టులో పాత్రుడయ్యాడు. అయినప్పటికి జట్టులో అతనికి తగ్గ గుర్తింపు లభించడంలేదని దీంతో యునైటెడ్ జట్టుకు మారిపోవాలనుకుంటున్నాని తెలిపాడు. ఈ 34 ఏళ్ల రాబిన్ అలియాంజ్ ఎరెనాలో 13 ప్రధాన టైటిళ్ల వరకు గెలుచుకున్నాడు. రియల్ మాడ్రిడ్ జట్టు నుంచి 2009లో మారాడు.

ఈ విషయం గురించి అతని మాటల్లో.. 'మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. కలిసి డిన్నర్ చేశాం. కెరీర్ గురించి చర్చించుకున్నాం. దీని కంటే ముందు వచ్చిన చిల్సీ ఆఫర్ బాగానే ఉంది. కానీ, అంతకంటే మాంచెస్టర్ యునైటెడ్ చెప్పిన బెనిఫిట్స్ నాకు బాగా నచ్చాయి. అందుకే నేను యునైటెడ్ జట్టుకు మారిపోదామని నిర్ణయించుకున్నా. ఇలా నేరుగా స్పందించడంతో కాదనలేకపోయా' అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, April 5, 2018, 17:55 [IST]
Other articles published on Apr 5, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి