Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్: రష్యాకు అర్జెంటీనా అధ్యక్షుడు రాకపై అనిశ్చితి

Argentine president still undecided on Russia’s visit for 2018 FIFA World Cup

మాస్కో: జూన్ 14వ తేదీ నుంచి రష్యా వేదికగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మాక్రి వస్తున్నారా? లేదా? విషయమై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయం రష్యాలో అర్జెంటీనా రాయబారి రిచర్డో లాగోరియో మీడియాకు చెప్పారు.

గతవారం అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మాక్రి.. రష్యాలో సాకర్ కప్ సంరంభాన్ని వీక్షించేందుకు రావడం లేదని అర్జెంటీనా మీడియా వార్తా కథకాలు ప్రచురించింది.

 ఫుట్ బాల్ జెయింట్ జట్లలో అర్జెంటీనా ఒకటి

ఫుట్ బాల్ జెయింట్ జట్లలో అర్జెంటీనా ఒకటి

ఫుట్‌బాల్ జెయింట్స్‌లో అర్జెంటీనా జట్టు ఒకటి. కానీ అర్జెంటీనా ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతోనే రష్యాలో సాకర్ మ్యాచ్‌లను వీక్షించేందుకు హాజరు కావడం లేదని మౌరిసియో మాక్రి చెప్పారు. ‘ఆయన (అధ్యక్షుడు) పర్యటనను రద్దు చేసుకున్నారని నేను ధ్రువీకరించడం లేదు' అని రష్యాలో అర్జెంటీనా రాయబారి రిచర్డో లాగోరియో తెలిపారు. ఇప్పటికీ మారిసియో మాక్రి రష్యా పర్యటన ఎజెండాలోనే ఉన్నదని చెప్పారు. మారిసియో మాక్రి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన పర్యటన తేదీలు, వారాలు ప్రకటించలేం' అని రిచర్డో లాగోరియో పేర్కొన్నారు.

 మారిసియో మాక్రో ఫుట్‌బాల్ అభిమాని

మారిసియో మాక్రో ఫుట్‌బాల్ అభిమాని

అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రో ఫుట్‌బాల్ అభిమాని అని రిచర్డో లాగోరియో చెప్పారు. గత జనవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల ప్రకారం మాక్రి తన కూతురు ఆంటోనియాతో కలిసి మ్యాచ్‌లను వీక్షించేందుకు వస్తానని హామీ ఇచ్చారు.

ఫిఫా ‘గ్రూప్' డీలో అర్జెంటీనా

ఫిఫా ‘గ్రూప్' డీలో అర్జెంటీనా

టీమ్ అర్జెంటీనా రష్యాలో జరిగే సాకర్ టోర్నీలో గ్రూప్ డీలో చేరింది. ఈ గ్రూపులో ఐస్‌లాండ్, క్రొయేషియా, నైజిరియా జట్లతో అర్జెంటీనా తల పడనున్నది. వచ్చేనెల 16వ తేదీన మాస్కోలో జరిగే మ్యాచ్‌లో ఐస్‌లాండ్, 21వ తేదీన క్రొయేషియా, 26వ తేదీన నైజీరియా జట్టుతో అర్జెంటీనా తల పడనున్నది.

 అర్జెంటీనా నుంచి ఐదు వేల మంది వీక్షకులు

అర్జెంటీనా నుంచి ఐదు వేల మంది వీక్షకులు

ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ టోర్నీని వీక్షించేందుకు అర్జెంటీనా నుంచి సుమారు ఐదువేల మంది వీక్షకులు రానున్నారని నిజ్ని నొవోగొరోడ్ రీజియన్ తాత్కాలిక గవర్నర్ గ్లెబ్ నికిటిన్ తెలిపారు. క్రొయేషియా జట్టుతో జరిగే మ్యాచ్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రో తప్పక హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. 2017 డిసెంబర్ ఒకటో తేదీన మాస్కోలోని క్రెమ్లిన్ ప్యాలెస్‌లో మ్యాచ్‌ల డ్రా విడుదల చేశారు. 32 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఒక్కో గ్రూపులో నాలుగు టీంల చొప్పున ఎనిమిది గ్రూపులను ఏర్పాటు చేశారు. రష్యా రాజధాని మాస్కోలో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి మరో 27 రోజుల సమయం మాత్రమే ఉన్నది.

11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణ

11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వహణ

రష్యాలోని 11 నగరాల్లోని 12 స్టేడియంలలో మ్యాచ్ లు జరుగుతాయి. మాస్కోలోని రెండు, సెయింట్ పీటర్స్ బర్గ్, సోచి, కజన్, సరాన్స్క్, కలినింగ్రాడ్, వొల్గో గ్రాడ్, రొస్టోవ్ ఆన్ డాన్, నిజ్నీ నొవోగొరోడ్, యాకతరింగ్ బర్గ్, సమర నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జూన్ 14 నుంచి జూలై 15వ తేదీ వరకు టోర్నమెంట్ సాగుతుంది.

Story first published: Thursday, May 17, 2018, 13:48 [IST]
Other articles published on May 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+